twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణుడు' రామదండు' స్టోరీ లైన్

    By Srikanya
    |

    కృష్ణుడు తాజా చిత్రం 'రామదండు'. ఈ చిత్రం కథ పల్లెటూరులో ఫుట్ బాల్ నేపధ్యంతో నడుస్తుంది. వినోదంతోపాటు క్రీడాస్ఫూర్తిని పంచే ఈ కథలో పల్లెటూళ్లో ఓ చిన్న ఫుట్‌బాల్‌ జట్టు ఉంటుంది. దానికి కృష్ణుడు కెప్టెన్ గా ఉంటాడు. ఆ జట్టు సాధించిన విజయాలేమిటి? రామదండులాంటి ఆ బృందం ఇంకేం సాధించిందన్నది తెర మీదే చూడాలి. ఈ చిత్రానికి రచయిత వేగేశ్న సతీష్ దర్శకుడు. బండి రాధికానారాయణరావు, బండి రత్నకుమార్ నిర్మాతలు. సౌమ్య కథానాయిక. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో విడుదల కానుంది.

    ''యువతరానికి వినోదంతో పాటు సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా ఇవ్వనున్నాం.పనిచేసిన అందరికీ సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. ప్రేక్షకులను కూడా అలరిస్తుందని మా నమ్మకం'' అని దర్శకుడు అన్నారు. స్ఫూర్తిదాయకమైన కథతో దర్శకుడు ఈ సినిమాను మలిచారని, ఈ సినిమాకు నిర్మాతలం కావడం మాకు గర్వకారణమని నిర్మాతలు చెప్పారు. ఎం.ఎస్.నారాయణ, కృష్ణభగవాన్, కొండవలస, మాస్టర్ భరత్, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఆర్.వర్మ, సంగీతం: శ్రీవసంత్.

    English summary
    Ramadandu is being made based on foot ball game.The movie is said to be a message oriented film with entertainment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X