twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడాకులు కాదు సమస్యని పరిష్కరించుకోండి : రంభ విడాకులకు కోర్ట్ సలహా

    రంభ విడాకుల కేసు సోమవారం విచారణకు వచ్చింది. నటి రంభ తన ఇద్దరు పిల్లలతో కోర్టుకు హాజరయ్యారు. అదే విధంగా ఆమె భర్త ఇంద్రకుమార్‌ కూడా కోర్టుకు వచ్చారు

    |

    హాట్ అండ్ సెక్సీ అంద చందాలతో పాటు ఆకట్టుకునే అభినయంతో ఒకప్పుడు దక్షిణాదిని ఓ ఊపు ఊపిన తార రంభ. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన రంభ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని చెన్నై కుటుంబ న్యాయస్థానంలో సినీ నటి రంభ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరినీ తమ సమస్యలను సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని చెన్నై హైకోర్టు సూచించింది.

    కెనడాలో కాపురం

    కెనడాలో కాపురం

    నటి రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను ప్రేమించి 2010లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కెనడాలో కాపురం పెట్టిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రంభకు ఇంద్రకుమార్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తడంలో రంభ తన ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నైకి తిరిగొచ్చేసింది. ఈ వార్తలు మీడియాలో రావటం తో మళ్ళీ ప్లేట్ తిప్పేసింది.

    తప్పంతా మీడియాదే:

    తప్పంతా మీడియాదే:

    ఆ వార్తలను ఖండిస్తూ... తన వైవాహిక జీవితం ఆనందంగానే ఉన్నా కావాలనే ఇలా రాస్తూ తనని భాదపెడుతున్నారు అంటూ... తప్పంతా మీడియా మీద వేసి విరుచుకు పడింది కూడా.. ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ..తాను చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ని గడుపుతున్నట్లు చెప్పింది.

    రూమర్స్ ని నమ్మవద్దని కోరింది

    రూమర్స్ ని నమ్మవద్దని కోరింది

    తను,తన భర్త,తన కూతురుతో హ్యాపీ లైఫ్ గడుపుతూంటే ఎలా ఈ విడాకులు వార్తలు వచ్చాయో తెలియటం అని వాపోయింది. ఇక వెబెసైట్స్ లో ఇలాంటి వార్తలు వస్తున్నాయని,అలాంటి బేస్ లెస్ వార్తలను చూస్తే చాలా భాధ వేస్తుందని చెప్పింది. తన అభిమానులు ఎవరూ కూడా తన డైవర్స్ విషయంలో వచ్చిన రూమర్స్ ని నమ్మవద్దని కోరింది. మీడియా వారిని కూడా అలాంటి వార్తలు ప్రసారం చేసే ముందు నిజా నిజాలు తెలుసుకోవటం మేలని అంది.

    నెలకూడా గడవకముందే

    నెలకూడా గడవకముందే

    తీరా ఆ ఇంటర్వ్యూ ఇచ్చి నెలకూడా గడవకముందే... ఇప్పుడు మళ్ళీ తన విడాకుల విషయం లో కోర్టుకెక్కిందట. విడాకుల కోసం కొంతకాలం ముందే ఫైల్ చేయగా.. ఇప్పుడు పిల్లల పెంపంకం కూడా తనకే ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. అందులో పిల్లల విద్య, సంరక్షణ ఖర్చుల కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని పేర్కొన్నారు.

    ఇద్దరు పిల్లలతో కోర్టుకు

    ఇద్దరు పిల్లలతో కోర్టుకు

    కాగా ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. నటి రంభ తన ఇద్దరు పిల్లలతో కోర్టుకు హాజరయ్యారు. అదే విధంగా ఆమె భర్త ఇంద్రకుమార్‌ కూడా కోర్టుకు వచ్చారు. దీంతో ఇది కుటుంబ సమస్య కాబట్టి రంభను ఆమె భర్తను ఒక ప్రత్యేక గదిలో ఉంచి సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ఒక న్యాయవాదిని నియమించారు. కాగా తదుపరి విచారణలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

    English summary
    Rambha appeared in the Court along with her two children and Indrakumar was also present. The judge stated that since this is a family dispute the husband and wife should sit together in the High Court premises counciling centre and talk it over and try to resolve their issues. Whether the warring couple will get back together or continue with divorce proceedings will be known soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X