»   » చూపులు కలసిన శుభవేళ: రంభ-ఇంద్రన్ నిశ్చితార్థం ఈ రోజే

చూపులు కలసిన శుభవేళ: రంభ-ఇంద్రన్ నిశ్చితార్థం ఈ రోజే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పటినుండో రంభ పెళ్లి పై వస్తున్న అనుమానాలకు తెరపడుతుంది త్వరలో రంభ పెళ్లి కూతురవబోతుంది. చందనా చీరను చుట్టి..బొమ్మనా బ్లౌజును తొడిగి కొత్త పెళ్లికూతురొచ్చే నేడే.." అంటూ బొంబాయి ప్రియుడు" లో రంభను ఉద్దేశించి హీరో జె.డి చక్రవర్తి పాట పాడతాడు. ఇప్పుడా పాట రంభ జీవితంలో నిజం కాబోతోంది. అవును రంభ పెళ్లికూతురు అయ్యారు అందుకు శ్రీకారం చుడుతూ ఈ రోజు బుధవారం(27.01.10) ఆమె వివాహానికి నిశ్చితార్ధం జరుగుతుంది. ఎవరితో అనుకుంటున్నారా? ఇంద్రకుమార్ తోనే. తమిళనాడు.తమిళనాడులో పుట్టి పెరిగిన ఇంద్రకుమార్ కెనడా, చైనా, చెన్నైలలో ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారవేత్తగా మారాడు.'మేజిక్ వూడ్స్" పేరుతో ఆయన స్థాపించిన అంతర్జాతీయ గహోపకరణాల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా రంభ ఎంపికై కోటిన్నర రూపాయల విలువైన కారును గెలుచుకొన్నారు. తర్వాత అతనితో ప్రేమలో పడి, ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకువచ్చింది.

ఈ రోజు సాయంత్రం 7 గంటలకు చెన్నైలోని పార్క్ షెరటాన్ హోటల్ లో నిశ్చితార్థ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా సమాచారం. వివాహానంతం రంభ సినీ కెరీర్ కు స్విస్తి చెప్పి తన భర్తతో కెనడాలో స్థిరపడే అవకాశాలున్నాయి. మార్చి నెలాఖరున తిరుపతిలో పెళ్లి జరుగుతుందని రంభ సోదరుడు శ్రీనివాస్ తెలుపుతున్నారు. అంతే కాదు పెద్దలు నిశ్చయించిన పెళ్లిగా దీనిని వర్ణిస్తున్నాడు. రంభ బ్రదర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu