»   »  ఫలించని రంభ రీ ఎంట్రి

ఫలించని రంభ రీ ఎంట్రి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rambha
రంభ చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తూ 'దొంగ సచ్చినోళ్ళు' లో చేసింది. తన అందాలు తరగలేదని నిరూపించుకుంటే మళ్ళీ వరస ఆఫర్లు వస్తాయినే తపనతో ఈ సినిమా ఒప్పుకుంది. దానికి తగ్గట్లే తన ముదురు అందాలని పూర్తి స్థాయిలో తెరనిండా పరిచింది. కాని సినిమాలో నవ్వుల కన్నా నస ఎక్కువ అవటంతో నీరు గారిబోయింది. దాంతో రంభ రీ ఎంట్రీకి అర్థం లేకుండా చేసింది. అప్పట్లో 'శ్రీరామచంద్రులు' సినిమా చేసినా ఇదే పరిస్థితి. ఇప్పుడు దొంగ సచ్చినోళ్ళు ది అదే దారి. కథ లేకుండా మాలాంటి వారిని అడ్డం పెట్టుకుంటే ఇంతే అని దగ్గర వాళ్ళ దగ్గర ఫీలవుతోందిట.

నిజానికి ఆమె అంటునట్లు కథ 'చిన్నోడు...పెద్దోడు' కాలం నాటిది. ఇందులో హీరోలిద్దరూ(రఘుబాబు,కృష్ణ భగవాన్) వయస్సు వచ్చినా బుర్ర ఎదగని బాపతు వెర్రిబాగులోళ్ళు. (కరెక్టే ఇలాంటి సినిమాలు వస్తున్న తెలుగు సినిమాది సేమ్ సిట్యువేషన్). అంతే గాక యాజ్ యూజువల్ గా బ్రహ్మచారులు. మామూలుగానే వాళ్ళ అక్క కూతురు రంభ. ఎప్పటిలాగే ఆమె తండ్రి వ్యాపారంలో మోసపోతాడు. ఆ భాధలో కారు డ్రయివ్ చేస్తూ యాక్సిడెంట్ చేసి భార్యా సమేతంగా పరలోక ప్రయాణం కడతాడు. దాంతో కామన్ గానే మందమతులైన మామయ్యలిద్దరూ ఆమె కోసం పోటి పడతారు. తర్వాత ఒన్ ఫైన్ డే క్యాజువల్ గా ఆమె తను ఆల్రెడీ రాజీవ్ కనకాల అనే కుర్రాడు ప్రేమలో ఉన్నానని చావు కబురు చల్లగా చెపుతుంది. దాంతో రొటీన్ గా మన హీరోలిద్దరూ రెచ్చిపోయి అన్ని సినిమాల క్లైమాక్స్ నే చేరుకుంటారు. ఇదీ కథ ...దీన్ని బట్టి రంభ రీఎంట్రి ఏ రేంజిలో జరిగిందో ఊహించుకోవచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X