For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ నిశ్చితార్దం జరిగే కోట విశేషం ఏంటి?

  By Srikanya
  |

  రామ్ చరణ్ తేజ, ఉపాసనల వివాహ నిశ్చితార్దం డిసెంబర్ 1 న జరగనుందినే సంగతి తెలిసిందే. మొన్న బుధవారం దీపావళి పండుగ సందర్భంగా గవర్నర్ కి శుభాకాంక్షలు చెప్పడానికి కుటుంబ సమేతం గా రాజ్ భవన్ కి వెళ్లిన చిరు ఆయనతో చెప్పారు.రామ్ చరణ్ కూడా గవర్నర్ ను తమ వివాహానికి వచ్చి అశీర్వదించవలసిందిగా కోరారు.ఆ నిశ్చితార్దం దోమకొండ కోటలో జరపాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ కోటలో విశేషమేముంది అనేది ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులలోనే కాక అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కోట విశేషానికొస్తే పద్దెనిమిదవ శతాబ్దంలో కట్టిన కోట ఇది. అసఫ్ జాహీ కట్టడాల ఆకృతిలో ఈ కోటను నిర్మించారు.అప్పట్లో కుతుబ్ షాహీల పాలనలో ఈ కోట ఉండేది. రాజభావనంలా ఉండే ఈ కోట కిటికీలపై అందమైన బొమ్మలు, చెక్కతో చేసిన కళాకృతులు కోట అందాన్ని ఇనుమడింపజేసే విధంగా ఏర్పాటు చేసారు. దాదాపు యాభై ఎకరాలలో ఈ కోట నిర్మితమై ఉంది. కోటలో మూడు భవనాలు ఉన్నాయి. అందులో ఒక భవనం పూర్తిగా అద్దాలతో నిర్మితమైనందున అద్దాలమేడగా పిలుస్తారు. ఈ కోటలో ఉన్న అందమైన కొలను కాకతీయుల కాలం నాటిదని చెబుతారు. స్థానికంగా ఈ కోటను గడీ అని పిలుస్తారు. ఉపాసన తాతయ్య ఉమాపతిరావు ఈ కోట నుంచి స్థానిక శివాలయంకు ప్రతి శివరాత్రి నాడు కుటుంబ సమేతంగా వస్తుంటారు.నిశ్చితార్ద కార్యక్రమాల కోసం ఇప్పటి నుంచే కోట మరమ్మత్తుల పనులు మొదలు పెట్టారు.

  మూడువందల ఏళ్ల నాటి ఈ కోటను పునరుద్ధరించి, అలంకరింపజేయడానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనున్నారని వినికిడి. ఇదిలా వుండగా ఈ నిశ్చితార్థ విందు కూడా అద్బతంగా ఉండబోతోంది. దానికోసం నెల్లూరుకి చెందిన చెయ్యి తిరిగినవారితో మాంసాహార వంటకాలను, తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారితో శాకాహార వంటకాలను వండించనున్నారట. ఇదిలా వుండగా రామ్‌చరణ్, ఉపాసనల నిశ్చితార్థం దోమకొండగడిలో జరుగుతోందని తెలిసి ఆ ప్రాంతాన్ని చూడటానికి సందర్శకులు, హీరో అభిమానుల తాకిడి ఇప్పటినుంచే అధికమవుతోంది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. సంపత్ నంది దర్సకత్వంలో రూపొందుతున్న రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

  English summary
  Ram Charan announced his engagement with Kamineni Upasana recently. some reports indicate that he has been gifted a chartered flight by the Kamineni family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X