నెక్స్ట్ మూవీ కోసం రాంచరణ్ కష్టాన్ని వివరించిన ఉపాసన!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాహుబలి తరువాతి స్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తూనే రాంచరణ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు.
రాంచరణ్ నెక్స్ట్ మూవీ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనుంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కాగా ఈచిత్రం కోసం రాంచరణ్ సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. తగ్గట్లుగా రాంచరణ్ కసరత్తు ప్రారంభించాడు. ఈ విషయాన్ని రాంచరణ్ సతీమణి ఉపాసన వెలడిందింది.
రాంచరణ్ ప్రతి రోజు కసరత్తులు చేస్తూ కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్న విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో వెల్లడించింది. బోయపాటి, రాంచరణ్ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతుండగా, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











