»   » క్యాలెండర్ గర్ల్స్‌ను ఇస్తే సరి: మాల్యాపై నోరు చేసుకున్న వర్మ

క్యాలెండర్ గర్ల్స్‌ను ఇస్తే సరి: మాల్యాపై నోరు చేసుకున్న వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రతి విషయంలోనూ వేలు పెట్టి కెలకడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటుగా మారింది. తన వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఆయన ఎప్పుడూ మీడియాలో ఉంటారు. తాజాగా, కింగ్‌ఫిషర్‌ మాజీ ఛైర్మన్‌ విజయ్‌మాల్యాపై అలాంటి వ్యాఖ్యలే చేసి మళ్లీ వార్తల్లోకెక్కారు ఆయన.

ట్విట్టర్‌ వేదికగా మాల్యాపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకర్లు ఆయనకు ఇచ్చిన వేల కోట్ల అప్పులు కట్టే బదులు మాల్యా దగ్గర ఉన్న క్యాలెండర్‌ గర్ల్స్‌ని ఒక్కొక్కరినీ ఒక్కొక్క బ్యాంకుకు ఇవ్వాలని, అప్పుడు ఈ గొడవంతా సద్దుమణిగిపోతుందని ట్వీట్‌ చేశారు.

Ramgopal Varma comments on Vijay Mallya

మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్‌ గర్ల్స్‌ ఆస్తులు ఏమైనా పెరిగి ఉంటే మరి వారు రుణం తీర్చాలి కదా.. అన్నారు. మాల్యా ఈ ఆఫరిస్తే బ్యాంకులు అంగీకరించకపోవచ్చు.. కాని బ్యాంకర్లు అంగీకరిస్తారు.. అంటూ చురకలేశారు.

క్యాలెండర్‌ గర్ల్స్‌లో కొంత మంది బాలీవుడ్‌ నాయికల పేర్లను కూడా ప్రస్తావించారు. మాల్యా అప్పులపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వర్మ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

English summary
Bollywood director Ram Gopal Varma made controversial comments against Vijay Mallya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu