»   » రంగా విషయం లో మరీ ఇంత దిగాజారుడా: వర్మ వ్యాఖ్యల మీద నిరసన పెరుగుతోంది

రంగా విషయం లో మరీ ఇంత దిగాజారుడా: వర్మ వ్యాఖ్యల మీద నిరసన పెరుగుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ట్విటర్ నుంచి బయటకు వచ్చినా రామ్ గోపాల్ వర్మ పద్దతి మారలేదు. మళ్ళీ మళ్ళీ అదే టైప్ లో ఏదో ఒక కాంట్రవర్సీ పోస్ట్ పెడుతూనే ఉన్నాడు.కాస్త ఒక వారం పది రోజుల నుంచీ కామ్ గా ఉన్నాడు కదా అనుకుంటున్న సమయం లోనే మళ్ళీ ఒక పెద్ద కాంట్రవర్సీతో వచ్చాడు. ఇదివరకే వంగవీటి సినిమా సమయం లోనే రెండు రాష్ట్రాలలోనే పెద్ద దుమారం లేపాడు. మళ్ళీ ఇప్పుడు అదే వ్యవహారాన్ని అదే రంగా ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు....

ఫేస్‌బుక్‌లో పోస్ట్

ఫేస్‌బుక్‌లో పోస్ట్

నిన్న విజయవాడలో వంగవీటి రంగా కుటుంబం పోలీస్ స్టేషన్‌లో కింద కూర్చుని ఉన్న ఫొటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి.. కొన్ని వివాదాస్పద రాతలకు రాంగోపాల్ వర్మ తెరలేపాడు. ఈ ఫొటోలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇలా కామెంట్ చేశాడు. తనకు వంగవీటి భార్య, కొడుకు అంటే ఎనలేని ప్రేమ అంటూ వర్మ వెటకారపు పోస్ట్ పెట్టాడు.

వంగవీటి రంగా స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్

వంగవీటి రంగా స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్

అంతేకాదు, స్టేషన్‌లో ఇలా కూర్చున్నందుకు వంగవీటి రంగా తన భార్య, కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఫీలవుతాడని, స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ కూడా వేస్తాడని పోస్ట్ పెట్టి రాంగోపాల్ వర్మ సరికొత్త వివాదాన్ని సృష్టించాడు. తల్లి ఎందుకు నల్లగా ఉందో, కొడుకు ఎందుకు తెల్లగా ఉన్నాడో లోరియల్ కాస్మొటిక్ కంపెనీ చెప్పాలని వర్మ చేసిన పోస్ట్‌పై పెనుదుమారమే రేగుతోంది.

సహకరించకపోవడమే

సహకరించకపోవడమే

రాంగోపాల్ వర్మ వంగవీటి చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఆ కుటుంబం అతనికి సహకరించకపోవడమే ఈ వికృతానందానికి కారణమని నెటిజన్లు భావిస్తున్నారు.బెజవాడ వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్న నేపథ్యంలో నిన్న జరిగిన పరిణామాల గురించి తెలిసిందే.

రంగా భార్య రత్నకుమారి

రంగా భార్య రత్నకుమారి

వైసీపీ బహిష్కృత నేత గౌతమ్ రెడ్డి రంగా, రాధా హత్యలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. విజయవాడలో నిన్న రంగా కుమారుడు రాధా, రంగా భార్య రత్నకుమారిలను ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయన్న కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో రంగా భార్య రత్నకుమారి, కొడుకు రాధా కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాధా చొక్కా గుండీలు ఊడిపోయి ఉన్నాయి.

English summary
"Vangaveeti Ranga will be so very proud of his wife and son that he will break dance in heaven" posted Ram Gopal Varma
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu