»   » ఇండ‌స్ట్రీలో అడ్జ‌స్ట్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి : టాలీవుడ్ చీకటి కోణం పై నోరు విప్పిన రమ్యకృష్ణ

ఇండ‌స్ట్రీలో అడ్జ‌స్ట్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి : టాలీవుడ్ చీకటి కోణం పై నోరు విప్పిన రమ్యకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవ‌లి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. తాజాగా శివగామి రమ్యకృష్ణ మరో సారి ఈ నీచ సంస్కృతి మీద నోరువిప్పింది.

రూమ్‌లకు వెళితేనే సినిమా అవ‌కాశాలు

రూమ్‌లకు వెళితేనే సినిమా అవ‌కాశాలు

నిర్మాత‌ల‌, ద‌ర్శ‌కుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చాలా మంది చెప్పారు. అలా లొంగ‌క‌పోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతుంద‌ని కూడా చెప్పారు. అలాంటి వేధింపులు చాలా ఎదుర్కొన్నామని కూడా కొంతమంది హీరోయిన్లు వెల్ల‌డించారు.

రాధికా ఆప్టే, సుకన్య లాంటి తారలూ

రాధికా ఆప్టే, సుకన్య లాంటి తారలూ

అందులో తాప్సీ పన్ను లాంటి హీరోయిన్ మాత్రమే కదు, రాధికా ఆప్టే, సుకన్య లాంటి తారలూ చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి సాగుతున్న....ఇప్పటికీ కొనసాగుతున్న నీచమైన వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది 'కాస్టింగ్ కౌచ్'. హీరోయిన్ గా అవకాశం కావాలంటే తనతో పడుకోవాలని అడిగే దర్శకులు, తనకు సెక్స్ సుఖం అందించాలని కోరే స్టార్ హీరోలు, నిర్మాతలు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

పెద్ద హీరోయిన్లు సైతం

పెద్ద హీరోయిన్లు సైతం

ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ఒప్పుకుంటున్నారు. తమకు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయని పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. అయితే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే సదరు దర్శకులు, నిర్మాతల పేర్లను బయట పెట్టే సాహసం మాత్రం ఎవరూ చేయడం లేదు.

అడ్జెస్ట్‌మెంట్‌ తప్పదు

అడ్జెస్ట్‌మెంట్‌ తప్పదు

అడ్జెస్ట్‌మెంట్‌ తప్పదంటూ ఇండస్ట్రీలో వేధింపులు గురించి నటి రెజీనా, ఒక ఛానల్‌ ప్రతినిధి మళ్లీ ఎప్పుడు కలుద్దామని అన్నారంటూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను ఇలాంటి వేధింపులను ఎదర్కొన్నానంటూ నటి సంధ్య ఇలా ఇటీవల పలువురు హీరోయిన్స్ ఛేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడించడం సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.

అన్నీ సమర్పించుకుంటే

అన్నీ సమర్పించుకుంటే

అదే సమయం లో టాలీవుడ్ లో హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు అన్నీ సమర్పించుకుంటే ఛాన్సులు వస్తాయని కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ ఆరోపించడం సంచలనంగా మారింది. అన్నీ వదులుకుంటే తప్ప అక్కడ హీరోయిన్లుగా నిలదొక్కుకోలేరని తేల్చి చెప్పింది.

తెలుగు ఇండస్ట్రీలో

తెలుగు ఇండస్ట్రీలో

తన గౌరవం కాపాడుకోవడానికే తాను టాలీవుడ్ కు వెళ్లడం లేదని., తెలుగు చిత్ర పరిశ్రమపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ‘కాస్టింగ్ కౌచ్' సంస్కృతి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతగా ఇంకెక్కడా లేదని ఆమె ఆరోపించింది. కొత్త హీరోయిన్లకి గౌరవం రక్షణ లేవని, కాంప్రమైజ్ కాకపోతే తెలుగు చిత్ర సీమలో హీరోయిన్ గా నిలబడలేరంటూ.

కన్నడలో కాస్టింగ్ కౌచ్ తక్కువ

కన్నడలో కాస్టింగ్ కౌచ్ తక్కువ

తెలుగు చిత్ర సీమతో పోల్చుకుంటే కన్నడ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పద్ధతి చాలా తక్కువ అని తన గౌరవం కాపాడుకునేందుకు కన్నడ సినిమాకే పరిమితమయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో అన్ని సమర్పించుకున్న వారే హీరోయిన్గా రాణిస్తారని, ఎవరైన ఎదురు తిరిగితే ఆ హీరోయిన్ కు ఒక్క అవకాశం కూడా దక్కదని అంది. అయితే ఈ మధ్య ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది అనుకుంటున్నంత లో సీనియర్ నటి రమ్య కృష్ణ మరో సారి ఈ తేనె తుట్టెను కదిలించింది.

హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ

హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ

వ్య‌వ‌హారంపై సీనియర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ తొలిసారి స్పందించింది. ఈ వ్య‌వ‌హారంపై త‌న స్పంద‌న‌ను బోల్డ్‌గా చెప్పిన ర‌మ్య‌కృష్ణ ఇత‌ర రంగాల మాదిరిగానే సినిమా ఇండ‌స్ట్రీలోనూ అడ్జ‌స్ట్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి అని చెప్పింది. అంతేకాకుండా అలా అడ్జ‌స్ట్ అయిన హీరోయిన్లే కెరీర్‌లో ముందుకు వెళ‌తార‌ని కూడా బోల్డ్‌గా చెప్పేసింది ర‌మ్య‌.

 వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను బ‌ట్టి

వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను బ‌ట్టి

అయితే అడ్జ‌స్ట్ అవ‌డం, కాక‌పోవడం అనేదివారి వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను బ‌ట్టి ఉంటుంద‌ని, అయితే అలా అడ్జ‌స్ట్ అయిన వారు మాత్ర‌మే ముందుకు వెళ‌తార‌ని చెప్పింది. ఇక్క‌డ ర‌మ్య‌కృష్ణ వాడిన అద్జస్ట్ అవటం అన్న పదాని అర్థమేమిటో అర్థమయ్యింది కదా.. ఇదీ హీరోయిన్లూ, నటీమణులకు ఎదురవుతున్న పరిస్థితి.

English summary
Senior Actress Ramya Krishna Who playd as Sivagami devi in Bahubali Opens up about casting couch in Tallywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu