»   » ఆ హాట్ లేడీ...చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ (ఫోటో ఫీచర్)

ఆ హాట్ లేడీ...చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సినీనటి రమ్యశ్రీ ఇటీవల రూ. లక్ష విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఏపి రాజధాని నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని టిడిపి అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం తెలిసిందే. ఈ మేరకు సినినటి రమ్యశ్రీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబుని కలిసి చెక్కు రూపంలో రూ. లక్ష అందజేసింది.

తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ లేడీగా పేరొందిన రమ్యశ్రీ ఇలా ముందుకు రావడం చర్చనీయాంశం అయింది. రమ్యశ్రీ లాగా పెద్ద పెద్ద స్టార్స్ ముందుకు వచ్చి రాజధాని కోసం విరాళం ఇవ్వాల్సిన అవసరం ఉందని, తద్వారా కొత్తరాజధాని కోసం విరాళాలు ఇచ్చేలా జనాల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

రమ్యశ్రీ గురించి వివరాలు స్లైడ్ షోలో......

రమ్యశ్రీ

రమ్యశ్రీ

రమ్యశ్రీ అసలు పేరు సుజిత. విశాఖపట్నంలో జన్మించింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరును రమ్యశ్రీగా మార్చుకుంది.

సౌత్‌ సినిమాల్లో..

సౌత్‌ సినిమాల్లో..

రమ్యశ్రీ ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ, బోజ్ పురి బాషల్లో ఇప్పటి వరకు దాదాపు 250 సినిమాల్లోనటించింది.

చివరి చిత్రం ‘మల్లి'

చివరి చిత్రం ‘మల్లి'

రమ్య శ్రీ తెలుగులో నటించిన చివరి చిత్రం ‘మల్లి'. 2013లో ఈ చిత్రం విడుదలైంది.

స్వీయ దర్శకత్వం

స్వీయ దర్శకత్వం

రమ్యశ్రీ స్వీయ దర్శకత్వంలో ‘ఓ మల్లి' చిత్రం తెరకెక్కింది. ఇందులో ఆమె అందాల ప్రదర్శన మాత్రమే కాదు...ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసే సబ్జెక్టు కూడా ఉంది. ఆర్.ఎ. ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది.

English summary
Ramya Sri, who was last seen in Telugu film O Malli, is one of the generous actresses in Tollywood, who often stretch their helping hand for social causes. Now, this popular South Indian actress has donated Rs 1 lakh for the development of new capital in Andhra Pradesh (Seemandhra).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu