»   » ‘మామ మంచు అల్లుడు కంచు’ లొకేషన్లో గ్లామర్ క్వీన్స్ (ఫోటోస్)

‘మామ మంచు అల్లుడు కంచు’ లొకేషన్లో గ్లామర్ క్వీన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మంచు విష్ణు నిర్మాతగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘మామ మంచు అల్లుడు కంచు' షూటింగ్ ప్రారంభం అయింది. ఈ భారీచిత్రాన్ని మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్', ‘ఢమరుకం' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

Ramyakrishna and Meena relaxing on the Sets!

డా. మోహన్ బాబుకు జోడీగా ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో ‘అల్లరి మొగుడు' అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. 23 ఏళ్ల తర్వాత ఈ త్రయం మళ్లీ మేజిక్ కలిసి నటిస్తున్నారు. తాజాగా మీనా, రమ్యకృష్ణలపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి.

Ramyakrishna and Meena relaxing on the Sets!

నరేష్ అల్లరి నరేష్ కు సరసన పూర్ణ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి అచ్చు, బప్పా లహరి, రఘు కుంచె పాటలు స్వరపరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. అలీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణభగవాన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సిపాన, కెమెరాః బాల మురుగన్, ఆర్ట్ః చిన్నా, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి, నిర్మాత: మంచు విష్ణు.స

English summary
Yesteryear actresses Ramyakrishna and Meena are playing pivotal roles in comedy entertainer 'Mama Manchu Alludu Kanchu'. The above picture is a moment captured while the Glamour Queens of the 90s are relaxing in the shooting spot during the break.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu