twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వాళ్ళలో సత్తా లేదు నేనేం చెయ్యను?' అంటున్న రాణా

    By Srikanya
    |

    నేను..నా రాక్షసి చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.అయితే రాణా మాత్రం ఆ విషయం ప్రక్కన పెట్టి...తెలుగు పరిశ్రమలో సరైన స్క్రిప్టులు రావటం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మా దగ్గరకు తెలుగు రైటర్స్ పట్టుకొస్తున్న స్క్రిప్టులలో సత్తా లేదు అంటున్నాడు. ఇంకరు ముందు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే మీడియా వద్ద వ్యక్తం చేసాడు. అతని మాటల్లో...ప్రస్తుతం మన పరిశ్రమలో ఫిలిం మేకర్స్ తగ్గిపోయి, ప్రపోజల్ మేకర్స్ పెరిగి పోయారు. పాపులర్ హీరోలు, దర్శకులు దొరికితే చాలు...సినిమా ప్రారంభించేస్తున్నారు. స్క్రిప్ట్ విషయం పట్టించుకోవడం లేదు. ఇది నిజంగా బాధాకరం. పూర్తి స్క్రిప్ట్ తో ఇప్పుడు ఎంతమంది షూటింగ్ చేస్తున్నారో చెప్పమనండి అన్నాడు. రాణా చెప్పేది కరెక్టే కావచ్చు కానీ స్క్రిప్టులు పట్టుకుని సురేష్ ప్రొడక్షన్స్ చుట్టూ తిరుగుతున్న రైటర్స్, డైరక్టర్స్ ఎంత మంది లేరు అని పరిశ్రమలో వారు అంటున్నారు. బయట హిట్టువుతున్న సినిమాల్లో చాలా భాగం సురేష్ ప్రొడక్షన్స్ లో రిజెక్టు అయినవే అని చెప్తున్నారు. రీసెంట్ హిట్ అలా మొదలైంది కూడా సురేష్ ప్రొడక్షన్స్ లో చెప్పి, రిజక్ట్ అయిందనేది వినపడే మాట.

    English summary
    Even though 'Nenu Naa Rakshasi' is declared a dud, Rana has confidence of making it big in Tollywood as an actor. "For last few years Telugu writers stopped coming up with good scripts," Rana blames it on failure of others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X