»   » హీరో రానా తమ్ముడి దాడి...పోలీస్ కేసు

హీరో రానా తమ్ముడి దాడి...పోలీస్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మనవడు, సినీ హీరో రానా తమ్ముడు అయిన అభిరామ్ జూబ్లీహిల్స్ రోడ్డు లో హల్ చల్ చేసి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. తమ కారును ఢీకొన్న వ్యక్తులపై అతడు దాడికి దిగాడు. కారును ఢీకొట్టిన వ్యక్తులపై భౌతికంగా దాడి చేసినట్లు తెలిసింది. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

అందుతున్న సమచారాం ప్రకారం సీసీటీవీ ఫుటేజి లో రికార్డయిన ప్రకారం జూబ్లీహిల్స్ చౌరస్తాలో బైక్ పై వచ్చిన ఇద్దరు విదేశీయులు అభిరామ్ వస్తున్న కారు ముందుభాగానికి కొంచెం తగిలించారు. అనంతరం వారు వెళ్లిపోతుండగా కారులో నుంచి కిందికి దిగిన అభిరామ్ ఆ విదేశీయులను వెంబడించి వారిపై దాడికి దిగాడు.

ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు తప్పు ఎవరిదనే విషయంపై పరిశీలన చేస్తున్నారు. ముందు ఎవరు దాడి చేశారు అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Rana brother Abhiram again @Police station

ఇంతకు ముందు...

కొన్ని కాలం క్రితం అభిరామ్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. రవితేజ అనే ఇంజనీర్ ఇంటిపై దాడి చేసినందుకు గాను, అతనిపై IPC 447, 223, 342, 506 సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు. అభిరామ్ కి ... ఇంజినీర్ రవితేజాకి మధ్య ఓ విషయంలో తలెత్తిన మనస్పర్థలే ఈ దాడికి కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయినా పోలీసులు ఇప్పటి వరకు అతనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

అభిరాంను త్వరలో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అభిరాంపై దాడి కేసు నమోదవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం అభిరాం నటనతో పాటు సినీమాకు సంబంధించిన ఇతర రంగాల్లో శిక్షణ తీసుకుంటున్నాడు.

English summary
Abhiram Daggupati registered police case against foreigners. Abhiram Daggubati is the second son of producer D Suresh Babu and the younger brother of Rana Daggubati.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu