»   » బన్నిని భుజాల పై మోస్తున్న రానా

బన్నిని భుజాల పై మోస్తున్న రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో ఆశ్చర్యపరుస్తోంది కదూ. అయితే రానా, బన్ని కు ఉన్న అనుబంధం తెలిసిన వారికి మాత్రం ఇది వింత అనిపించదు. వారిద్దరూ షూటింగ్ లు లేకపోతే సిటీని చుట్టేస్తారు. ఫన్ ని ఎంజాయ్ చేస్తారు. రానా అయితే ఇదిగో బన్ని ని ఇంతలా ఇష్టపడతాడు. అయితే ఈ ఫొటో ఎక్కడిదీ అంటే నిన్న రాత్రి తీసింది.

గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియం నిన్నంతా సెలబ్రెటీల హంగామానే. శనివారం రాత్రి వైట్ సెన్సేషన్ పేరిట నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు సినీతారలతో పాటు పలు ప్రాంతాల నుంచి సెలబ్రిటీలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

అందరూ తెలుపురంగు వస్త్రానే రావాలనే నిబంధన ఉండడంతో స్టేడియం శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది. అక్కడకు వచ్చినప్పుడు ఇదిగో రానా ఇలా రెచ్చిపోయి అల్లు అర్జున్ ని భుజాలపై ఎక్కించుకున్నాడు.

Rana Carried Stylish Star on his shoulders

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఊపిరి పోసుకుని ప్రపంచదేశాలను చుట్టేస్తున్న ఈ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ప్రఖ్యాత డీజేలు..డ్యాన్సర్లు తమ ప్రదర్శనలతో వేలమందిని అలరించారు.

తెల్లని అలంకరణ, డ్యాన్సర్లకు తెల్లని దుస్తులు.. ఇలా సమస్తం శ్వేతవర్ణమయమై సాగే ఈ నృత్యోత్సవంలో ఊగే వేదిక ప్రత్యేక ఆకర్షణ. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ కార్యక్రమం సాగింది. దాదాపు 20వేల మంది హాజరైనట్టు నిర్వాహకుడు విజయ్ అమృత్‌రాజ్ చెప్పారు.

English summary
Allu Arjun & Rana Daggubati had a blast last night at Sensation Music Show held at GMC Balayogi Stadium.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu