For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంచలన రీమేక్‌లో రానా దగ్గుబాటి.. మూడు భాషల్లో దండయాత్ర..

  By Rajababu
  |

  బాహుబలి తర్వాత రానా దగ్గుబాటి వరుస చిత్రాలతో దండయాత్ర మొదలుపెట్టాడు. బాహుబలి2 నిర్మాణంలో ఉండగానే ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలకు పచ్చ జెండా ఊపి విజయాలను సొంతం చేసుకొన్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అనే తేడా లేకుండా రానా సెన్సేషనల్ చిత్రాలతో రాకెట్‌లా సినీ ఆకాశంలోకి దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంగా తెరకెక్కనున్న 1945 చిత్రంలోనూ, అలాగే ట్రావంకోర్ మహారాజు జీవిత కథ ఆధారంగా తెకకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంలో నటిస్తున్నాడు రానా తాజాగా ట్వీట్ చేశారు.

   హాథీ మేరా సాథీ రీమేక్‌లో

  హాథీ మేరా సాథీ రీమేక్‌లో

  1971లో బాలీవుడ్‌లో విశేష ప్రేక్షకాదరణను చూరగొన్న చిత్రం హాథీ మేరే సాథీ. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హీరోగా నటించారు. ఆ ఏడాదిలో బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం ఆ చిత్ర రీమేక్‌లో నటిస్తున్నాను అని రానా దగ్గుబాటి ఇటీవల ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు నేను చేయనటు పాత్ర నాకు లభించడం చాలా సంతోషం అని రానా పేర్కొన్నారు.

   రానా దగ్గుబాటి స్పందన ఇది

  రానా దగ్గుబాటి స్పందన ఇది

  హాథీ మేరే సాథీ రీమేక్‌లో నటించడంపై రానా స్పందిస్తూ.. దేశంలోని సినీ అభిమానులందర్ని ఆకట్టుకునే కథా చిత్రంలో నటించాలని ఉంటుంది. ప్రకృతి, జీవరాసులు కథతో రూపొందించే చిత్రంలో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఈ చిత్రంలో ఏనుగు కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి, ఏనుగు మధ్య ఉండే సంబంధంతో తెరకెక్కే ఈ చిత్రం భావోద్వేగమైన కథ అని రానా ట్విట్టర్‌లో అన్నారు.

   హాథీ మేరా సాథీ బ్లాక్‌బస్టర్

  హాథీ మేరా సాథీ బ్లాక్‌బస్టర్

  హాథీ మేరే సాథీ చిత్రంతో తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రముఖ సినీ రచయితలు సలీం జావేద్ స్క్రీన్ ప్లే అందించిన చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందర్ రాజ్ ఆనంద్ మాటలు రాసిన ఈ చిత్రంలో రాజేశ్ ఖన్నా, తనుజా నటించారు. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించారు. ఆ తర్వాత ఈ చిత్రం నల్లా నేరం అనే పేరుతో తమిళంలో రీమేక్ అయింది.

   రాజేశ్ ఖన్నా కెరీర్‌లో మైలురాయి

  రాజేశ్ ఖన్నా కెరీర్‌లో మైలురాయి

  రాజేశ్ ఖన్నా కెరీర్‌లో ఓ మరుపురానటువంటి చిత్రం హాథీ మేరా సాథీ. 1969 నుంచి 1971 వరకు రాజేశ్ ఖన్నా 17 వరుస హిట్లు ఇస్తే అందులో ఈ చిత్రం ఒకటి. రాజేశ్ ఖన్నా అందించిన 17 హిట్లలో 15 హిట్లు ఆయన సింగిల్ హీరోగా నటించినవి కావడం విశేషం.

   1945 చిత్రంలో రానా

  1945 చిత్రంలో రానా

  ఇక హాథీ మేరే సాథీ సినిమాను పక్కన పెడితే.. రానా ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 1945 ఒకటి. ఈ చిత్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ నేతృత్వంలో నడిచిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సైనికుడిగా రానా కనిపించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సత్య శివ దర్శకుడు.

  చరిత్ర తిరగరాస్తున్నాం

  చరిత్ర తిరగరాస్తున్నాం

  1945గా పేర్కొంటున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. రెండో షెడ్యూల్‌ను తాజాగా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రానా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మరోసారి చరిత్రను తిరగరాయబోతున్నాం. 1945 కాలంలోకి తిరిగి వెళ్లిపోతున్నాం. 1945 సినిమాకు సంబంధించిన మరో భారీ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నాం అని రానా గతనెల ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  మరట్వాడ వర్మ కథా చిత్రంలో

  మరట్వాడ వర్మ కథా చిత్రంలో

  రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో చిత్రం ‘అనిజమ్ థిరునాల్ మరట్వాడ వర్మ.. ది కింగ్ ఆఫ్ ట్రావంకోర్'. ఈ చిత్రంలో ట్రావంకోర్ మహారాజు మరట్వాడ వర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని గత నెల రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకొగా ఆ వార్త మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

  English summary
  Rana Daggubati is all set to pay tribute to the legendary actor and the first superstar of Bollywood the late Rajesh Khanna by playing the lead protagonist in the remake of 1971 blockbuster Haathi Mere Saathi. The remake will be made in Hindi, Tamil and Telugu. Rana Daggubati shared his excitement about the film and quoted to Mumbai Mirror “There’s a very exciting physical language to the character I’m playing in Haathi Mere Saathi and is completely different from what I’ve done in the past.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X