»   »  ‘బాహుబలి'లో రానా పాత్ర పై షాకిచ్చే న్యూస్

‘బాహుబలి'లో రానా పాత్ర పై షాకిచ్చే న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి' లో దగ్గుబాటి యువ హీరో రాణా నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే షాకిచ్చే న్యూస్ ఏమిటంటే ఇందులో రానా ... తండ్రిగా కనిపించనున్నాడు. అతని కొడుకుగా పవన్ కళ్యాణ్ పంజా చిత్రం విలన్ అడవి శేషు కనిపిస్తారు. ఇద్దరవీ నెగిటివ్ రోల్సే. అలాగే గారాబంతో చెడిపోయిన కొడుకు పాత్ర అడవి శేషుది అని తెలుస్తోంది.

ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 'బాహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు ఉండటంతో రాజమౌళి కొత్త వారిని తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ తన కొత్త సినిమా చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయిని తెలిపాడు.

ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.

English summary
Rana playing a baddie in Rajamouli’s 'Baahubali' is not breaking news anymore. The latest is that the star plays the role of a father in the period film. His son in the film is none other than Adivi Sesh, who shot to fame as a spoilt brat in the Pawan Kalyan-starrer 'Panjaa'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu