»   » సుచీలీక్స్‌: అందుకే నన్ను టార్గెట్ చేశారు.. త్రిషతో ముద్దుపై రానా స్పందన..

సుచీలీక్స్‌: అందుకే నన్ను టార్గెట్ చేశారు.. త్రిషతో ముద్దుపై రానా స్పందన..

Written By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార త్రిషా కృష్ణన్‌ను ముద్దు పెట్టుకొంటున్న ఫొటోపై 'భళ్లాలదేవ' రానా దగ్గుబాటి స్పందించారు. ప్రముఖ గాయని సుచిత్ర ఈ ఫొటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Rana

ప్రముఖ నటులు ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్, ఇతర తారల ఫోటలను సుచిత్ర ట్వీట్ చేయడం గతనెల దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే రానా, త్రిష ఫోటో ట్విట్టర్‌లో వెలుగు చూసింది.

మీడియా కొండంత చేసింది

మీడియా కొండంత చేసింది

ఇటీవల రైజ్ ఆఫ్ శివగామి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సుచీలీక్స్ వివాదంపై రానా స్పందిస్తూ.. ఏదో జరిగిపోయింది అని మీరు అనుకొంటున్నారా?. గోరంత విషయాన్ని మీడియా కొండంత చేసింది. కానీ మీరు అనుకొన్నట్టు అలా దిగజారలేదు. ఎన్నో ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. నా ఒక్క ఫొటోపై రాద్దాంతం చేశారు. బహుశా వారికంటే నాకు పాపులరారిటీ ఎక్కవ అనుకుంటా అని రానా అన్నారు.

నేను లైట్ తీసుకొన్నాను..

నేను లైట్ తీసుకొన్నాను..

ఐపా ఉత్సవంలో ఈ వ్యవహారంపై తానే జోకులు పేల్చాను. దానిని బట్టి మీరు ఊహించుకోవచ్చు. సుచీలీక్స్ ఉదంతాన్ని నేను సీరియస్‌గా తీసుకొన్నానో అర్థం అవుతుంది అని రానా పేర్కొన్నారు.

త్రిషా, రానా అఫైర్

త్రిషా, రానా అఫైర్

గత సంవత్సరాలుగా రానా, త్రిషలిద్దరూ అఫైర్‌లో మునిగి తేలుతున్నారనే రూమర్లు జోరుగా ప్రచారమైంది. తమ అఫైర్‌పై మీడియా వద్ద పెదవి విప్పకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మీడియా ఈ విషయంపై అడిగినప్పుడల్లా తమ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చెప్పుకొచ్చారు.

ఘాజీతో దుమ్మురేపిన భళ్లాలదేవ

ఘాజీతో దుమ్మురేపిన భళ్లాలదేవ

దగ్గుబాటి రానా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. బేబీ, ఘాజీ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక 2015 విడుదలైన బాహుబలి1 చిత్రంతో రానా అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకొన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ఏప్రిల్ 28 విడుదలకు ముస్తాబవుతున్నది. బాహుబలిలో భళ్లాలదేవ పాత్రకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.

English summary
Rana Daggubati finally opens up on the controversial leaked photo of him kissing Trisha Krishnan. Last month Singer Suchitra leaked a private photo of actors Rana Daggubati and Trisha Krishnan having an intimate moment. That Photo goes viral on the net.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu