»   » అభిమానికి రానా సారీ.. తాప్సీ బంపర్ ఆఫర్‌..

అభిమానికి రానా సారీ.. తాప్సీ బంపర్ ఆఫర్‌..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఘాజీ చిత్రంపై వస్తున్న ప్రశంసలకు రానా దగ్గుబాటి సంతోషంతో ఉప్పొంగుతున్నారు. ట్విట్టర్‌లో వెల్లువెత్తుతున్న ట్వీట్ల మధ్య ఓ సరదా సంఘటన చోటుచేసుకొన్నది. ఇటీవల అభిమాని చేసిన ట్వీట్‌ను చూడలేకపోయిన రానా సారీ చెప్పాల్సి వచ్చింది.

రానా దగ్గుబాటి.. ఎంటీ సర్, సినిమా చూడగానే మీ యాక్టింగ్ తెగ నచ్చేసింది. మంచి ఎక్సైట్‌మెంట్‌తో ట్వీట్ చేశాను. కానీ మీరు రిప్లై ఇవ్వలేదు. నేను చాలా బాధపడ్డాను అని ఐశ్వర్య అనే అభిమాని తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసింది.అందుకు సమాధానంగా థ్యాంక్స్ అండీ. సారీ మీ ట్వీట్‌ను చూసుకోలేదు అని రానా సమాధానమిచ్చారు.అలాగే రానాను ఉద్దేశించి తాప్సీ ఇటీవల తన మనసులోని కోరికను బయటపెట్టింది. 'డియర్ వార్ స్టార్. పూర్తిస్థాయి చిత్రంలో నాతో నటిస్తావా' అని రానాను తాప్సీ అడిగింది. ఆ ట్వీట్‌పై వెంటనే రానా స్పందించాడు. మనం ఇద్దరం కలిసి చాలా చాలా సినిమాల్లో నటిద్దాం. ఎలా నటిద్దామో నువ్వే ప్లాన్ చెయ్యి అని జవాబిచ్చారు.


English summary
Rana Daggubati says sorry to his fans and responded to Taapsee Offer. Rana said that We will do lots and lots a films together that much I know.... now let's figure out how!.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu