»   » అసలేం జరుగుతోంది:ఈ శ్రియతో అక్కడ కనిపించిన దగ్గుపాటి రానా

అసలేం జరుగుతోంది:ఈ శ్రియతో అక్కడ కనిపించిన దగ్గుపాటి రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: దగ్గుపాటి రానాకు కెరీర్ మొదటి నుంచి ప్లే బోయ్ అనే ముద్ర కంటిన్యూ అవుతూ వస్తోంది. అందులో ఎంత వరకూ నిజముంది అనేది ప్రక్కన పెడితే... ఆ వార్త రానాకు కలిసొచ్చిందేమీ లేకపోయినా...మీడియాలో ఓ స్దాయిలో పబ్లిసిటీ మాత్రం జరుగుతోంది.

ఆ మధ్యన త్రిషతో రానా బాగా కాస్త క్లోజ్‌గానే మూవ్ అయ్యాడని, వీళ్ళ మధ్య ఎఫైర్ న‌డుస్తోంద‌ని చిత్ర పరిశ్రమ కోడై ,కాస్సేపు కాకై కూసింది. వీరిద్దవీద్దరూ చ‌ట్టాప‌ట్టాలేసుకొని తిర‌గ‌డం, ఫొటో షూట్‌ల‌కు ప్రత్యేకంగా పోజులివ్వడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే తర్వాత వీరి మధ్య గ్యాప్ వచ్చింది. త్రిష తన కెరిర్ లో బిజీగా మారిపోయింది. ఆ తర్వాత రానా ఒంట‌రిగానే కనిపించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు అలాంటి వార్తతో రానా మన ముందుకు వచ్చాడు.

Photos : ముంబైలో శ్రియ రానా

అయితే మాజీ హీరోయిన్ , సీనియర్ అయిన శ్రియ పేరు తెరపైకి వచ్చింది. శ్రియ, రాణాలు మీద గతంలో రకరకాల రూమర్స్ రావటం,వాటిని ఇద్దరూ విడివిడిగా ఖండించటమూ జరిగింది. ఇక తాజాగా ముంబైలో జంటగా కనిపించడం ఆసక్తికరంగా ఉంది.

Rana Daggubati snapped with Shriya Saran in Mumbai

ఒక రెస్టారెంట్ వద్ద వీళ్లిద్దరూ జతగా కనిపించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లను శ్రియ ఖండిస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ కు సంబంధించిన ఈవెంట్ కు తాము ఇరువురమూ హాజరయ్యామని చెబుతోంది.

ఇంతకు ముందు కూడా ...రానా, శ్రియ శరన్‌ల మధ్య ఏదో నడుస్తోందన్న రూమర్స్ జోరుగా వినిపిస్తున్న తరుణంలో తమ మధ్య ఫ్రెండ్షిప్ తప్ప మరేదీ లేదని క్లారిటి ఇచ్చింది శ్రియ. కాకపోతే ఇద్దరూ కలిసి తరచుగా కనిపిస్తుండడంతో ఇలాంటి క్లారిటీలు వర్కవుట్ అయ్యేటట్లు కనపడటం లేదు.

Rana Daggubati snapped with Shriya Saran in Mumbai

వీరిద్దరూ చెప్పేది ఒకటే... మా ఇద్దరికీ కామన్‌ ఫ్రెండ్స్‌ చాలా మందే ఉన్నారు! వారి ఇళ్ళల్లో ఫంక్షన్లకి ఇద్దరం వెళుతున్నాం కాబట్టి మా మధ్య ఏదో ఉందని జనాలు అనుకుంటున్నారే తప్ప వారు ఊహిస్తున్నది ఏదీ లేదని చెబుతోంది శ్రియ.సరే ఈ మాట ఎంత కాలం చెప్తుంది అంటున్నారు బాలీవుడ్ జనం.

English summary
Rana Daggubati , was spotted with diva Shriya Saran at Korner House, Mumbai. Earlier this year, Rana and Shriya made headlines when the duo were clicked lunching in Delhi. Notably, several media outlets carried news saying that the couple were dating for quite some time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu