»   » నేవీ అధికారిగా దగ్గుపాటి రానా...ఇండియాలో తొలి చిత్రం

నేవీ అధికారిగా దగ్గుపాటి రానా...ఇండియాలో తొలి చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'జలాంతర్గామి నేపథ్యంలో సాగే ఓ చిత్రంలో నటించేందుకు దగ్గుపాటి రానా పచ్చజెండా వూపినట్టు తెలుస్తోంది. సంకల్ప్‌రెడ్డి అనే యువ దర్శకుడు ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఆయన స్వయంగా రచించిన 'బ్లూ ఫిష్‌' పుస్తకం స్ఫూర్తితో స్క్రిప్టుని సిద్ధం చేసుకొన్నారని చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూర్తి వివరాల్లోకి వెళితే... 1971లో భారత్‌-పాక్‌ మధ్య జరిగిన యుద్ధంలో పాక్‌ సైన్యం పీఎన్‌ఎస్‌ ఘాజి నౌకని మోహరించింది. ఆ తర్వాత నౌక సముద్రంలో మునిగిపోయింది. ఆ నేపథ్యంలోనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. రానా నేవీ అధికారిగా కనిపిస్తారు.

Rana Daggubati to play naval officer in his next

ఎక్కువభాగం సినిమాని సముద్రంలోనే తెరకెక్కిస్తారు. ఇప్పటికే సినిమా కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దినట్టు సమాచారం. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలో తెరకెక్కుతున్న తొలి జలాంతర్గామి సినిమా ఇదే అని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

ఇక.. ‘బాహుబలి' లో మెయిన్ విలన్ గా కనిపించిన రానా దగ్గుబాటికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇంత పెద్ద విజయం అందుకున్న తర్వాత కాస్త గప్ తీసుకున్న రానా తమిళంలో తెరకెక్కుతున్న ‘బెంగుళూరు డేస్' రీమేక్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ సినిమాని పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.

Rana Daggubati to play naval officer in his next

స్లార్ల సినిమాలకు పనిచేస్తూ బిజీగా గడుపుతున్న టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ త్వరలోనే డైరెక్టర్‌గా మారుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే కథల్ని సిద్ధం చేసుకున్న ఆయన పలువురు హీరోలకి విన్పించాడట. రానాకి కూడ ఓ కథ చెప్పాడట. అది విన్న రానా చేద్దామని కూడ మాట ఇచ్చినట్టు తెలిసింది.

ప్రస్తుతం బాహుబలి 2 సినిమా కోసం సన్నద్ధమవుతున్న రానా ఆ చిత్రం తర్వాత ప్రేమ్‌ రక్షిత్‌తో సినిమా చేస్తాడని ప్రచారం సాగుతోంది. ఆ సినిమా కూడ రానా ఓన్‌ బ్యానర్‌ సురేష్‌ ప్రొడక్షన్స్‌లోనే తెరకెక్కుతున్నట్టు సమాచారం. ప్రేమ్‌రక్షిత్‌ తో రానా సినిమా చేస్తాడా అన్నది చూడాలి. డ్యాన్స్‌మాస్టర్లలో ప్రేమ్‌రక్షిత్‌ తోపాటు రఘు కూడ త్వరలోనే కెప్టెన్‌గా మారుతాడని తెలిసింది.

English summary
Rana Daggubati will reportedly be essaying the role of a naval officer in his next yet-untitled Telugu project about the mysterious sinking of the PNS Ghazi submarine.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu