For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రత్యేక పాత్రలో రానా దగ్గుబాటి ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : తెలుగు హీరో రానా దగ్గుబాటి త్వరలో మరో చిత్రంలో స్పషల్ పాత్రను పోషిస్తున్నారు. 'యే జవానీ హై దీవానీ' అనే హిందీ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణె, రణ్‌బీర్‌ కపూర్‌ జంటగా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఈ ప్రేమ కథా చిత్రానికి కరణ్‌ జోహర్‌ నిర్మాత. గతంలో రానా దగ్గుపాటి హిందీలో దమ్ మారో దమ్,డిపార్టమెంట్ చిత్రాలలో నటించి ఉన్నారు. అయితే ఆ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. అలాగే ఇప్పటికే రానా ఓ తమిళ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.

  ప్రస్తుతం జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) దర్శకత్వంలో రానా నటించిన 'కృష్ణంవందే జగద్గురుమ్' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. నవంబర్ 30న విడుదల చేయడానికి నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సన్నాహాలు చేస్తున్నారు. 'కృష్ణంవందే జగద్గురుమ్'లో దగ్గుపాటి రానా ఏకంగా నరసింహుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, తోటరాముడు వంటి పలు పాత్రల్లో నటించేశారు. బీటెక్‌బాబు పాత్రతో దర్శకుడు క్రిష్ తన దగ్గరకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు రానా.

  తన పాత్ర గురించి చెపుతూ... ఇందులో నా పాత్ర సురభి నాటక కళాకారుని పాత్ర. ఈ పాత్ర పోషణ కోసం వారి జీవన విధానాలను గమనించాలనుకున్నాను. రవీంద్రభారతికి వెళ్లి పలు నాటకాలు చూశాను. 'కురుక్షేత్రం' నాటకం నన్నెంతో కదిలించింది. ఎందుకంటే... స్టేజ్‌పై 40మంది పైగా నటిస్తుంటే ఆరుగురు మాత్రమే ఆడియన్స్ కనిపించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కథలో హీరో ఫ్రస్టేషన్ కూడా అదే. ఓ సన్నివేశంలో 'మన జీవితాలు మేకప్ కంపు కొడుతున్నాయ్' అంటాడు. నిద్రలో వచ్చేది 'కల'... నిద్రలేపేది 'కళ'అనే డైలాగుకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.

  'బళ్లారి బావ...' పాటలో బాబాయ్ వెంకటేష్ కనిపించడం ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. పాటలో 'రారా బొబ్బిలి రాజా...' అని లిరిక్ ఉంటుంది. అందుకే బాబాయ్ చేస్తే కరెక్ట్ అని అడగ్గానే ఒప్పుకున్నారు. ఇటీవలే సినిమా చూసి 'మంచి చాన్స్ కొట్టేశావ్‌రా...' అని అభినందించారాయన. అలాగే...నయనతార లాంటి స్టార్‌తో పనిచేయడం గర్వంగా ఫీలవుతున్నాను. గత విజయదశమికి క్రిష్ నాకీ కథ చెప్పారు. సరిగ్గా ఈ విజయదశమికి సినిమా పూర్తి అయ్యింది. తలచుకుంటే ఇదంతా ఓ కలలా ఉంది. ముందు ఒక ఐడియాగా క్రిష్ నాకీ కథ చెప్పారు. ఆ ఐడియా ఇంతటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని ఊహించలేదు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ అడ్వంచరస్ సినిమా అయినా... క్రిష్ తరహా మానవీయ విలువలకు కొదవ ఉండదు అని ఆనందంగా చెప్పుకొచ్చారు రానా.

  English summary
  After playing a cameo in Ajith-Vishnuvardhan's untitled Tamil film, buzz is that Daggubati Rana will make another brief appearance and this time in a Bollywood film. The actor will be seen in a guest appearance in Ayan Mukherji's Yeh Jawaani Yeh Deewani starring Ranbir Kapoor and Deepika Padukoone. The film, which is made under Karan Johar's Dharma Productions, also has Aditya Roy Kapur and Kalki Koechlin in supporting roles and is billed to be a romantic entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X