»   » రామ్ గోపాల్ వర్మ పుస్తకం ప్రేరణతోనే రాణా, జెనీలియా

రామ్ గోపాల్ వర్మ పుస్తకం ప్రేరణతోనే రాణా, జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా, జెనీలియా కాంబినేషన్ లో సుకుమార్ అశోసియోట్ ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ గా రామ్ గోపాల్ వర్మ సంచలన పుస్తకం నా ఇష్టం పెడుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కథకు ఈ టైటిల్ యాప్ట్ అని దర్శకుడు ఫీలవటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బాలకృష్ణకు'సింహా' చిత్రంతో విజయం అందించిన 'యునైటెడ్‌ మూవీస్‌'నిర్మించనుంది. ఏప్రిల్‌ 9న నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు నిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు.'లీడర్‌ ద్వారా ఆర్టిస్టుగా తానేంటో రాణా నిరూపించుకున్నాడు. 'నేను నా రాక్షసి'తో కమర్షియల్‌ స్టామినా చూపించబోతున్నాడు. మేం తీయబోయే చిత్రం ఫీల్‌గుడ్‌ యూత్‌ లవ్‌స్టోరీగా నిలుస్తుంది' అని నిర్మాత కిరీటి చెప్పారు. సుకుమార్‌ వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించిన ప్రకాష్‌ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రాణా తొలి బాలీవుడ్ చిత్రం 'దమ్ మారో దమ్' ఏప్రిల్ 22న విడుదల కానుంది.

English summary
Rana and Genelia have paired up together in a film in the direction of a new director Prakash Toleti. And the movie is likely to be titled Naa Istam, which incidentally is RGV's book title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu