twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడు పోస్ట్‌మార్టమ్‌ అనవసరం: రాణా

    By Srikanya
    |

    ఇప్పుడు పోస్ట్‌మార్టమ్‌ అనవసరం. ఆ సినిమాలో నాది చాలా బలహీనమైన పాత్ర. నా తొలి హిందీ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌తో చేశాను. ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్‌తో చేశాను. ఇది యాధృచ్ఛికమే అయినా... నాకొక భిన్నమైన అనుభూతి అన్నారు దగ్గుపాటి రాణా. ఆయన తాజా చిత్రం 'డిపార్ట్‌మెంట్‌' విడుదల ఈ రోజు అవుతోంది. ఈ సందర్భంగా ఆయన హిందీలో చేసిన తొలి చిత్రం 'దమ్‌ మారో దమ్‌'గురించి అడిగితే ఆయన ఆసక్తి చూపకుండా ఇలా స్పందించారు.

    అలాగే 'డిపార్ట్‌మెంట్‌'లో తన పాత్ర గురించి చెపుతూ... పోలీసు డ్రామాతో తెరకెక్కిన చిత్రమిది. మాఫియా నేపథ్యంలో సాగుతుంది. ముంబయిలో మాఫియాని అదుపులో పెట్టడానికి పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేకంగా ఓ బృందాన్ని సిద్ధం చేస్తుంది. చట్టం, న్యాయం ఇవేవీ ఆ బృందానికి వర్తించవు. అందులో పని చేసే శివనారాయణ్‌ అనే ఓ పోలీసు అధికారి పాత్ర నాది. నిజాయతీపరుడు. అతని చుట్టూ చోటు చేసుకొనే సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ముంబయిలో జరిగిన కొన్ని సంఘటనల స్ఫూర్తితో వర్మ ఈ కథను సిద్ధం చేశారు అన్నారు.

    ఇక చిత్రంపై తన అంచనాలు గురించి చెపుతూ.. సినిమా హిట్ ప్లాప్ లను ముందుగానే చెప్పగలిగేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. వర్మలాంటి దర్శకులతో పని చేస్తే చాలు... నటుడిగా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అంతకుమించి నేనేమీ ఆశించలేదు. ఆయనది ఇరవయ్యేళ్ల అనుభవం. గుర్తుండిపోయే సినిమాలెన్నో తీశారు. ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన ఒక గొప్ప అవకాశం అన్నారు. అయినా అమితాబ్‌, సంజయ్‌దత్‌, రామ్‌ గోపాల్‌ వర్మ లాంటి అనుభవజ్ఞులతో కలిసి పని చేయడం గొప్ప మలుపుగా భావిస్తాను. ఇంకా ఆ సినిమా ఫలితం గురించి నేను ఆలోచించాలా? అని తేల్చి చెప్పారు.

    మరో ప్రక్క రాణా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రం చేస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాణా బిటెక్ బాబుగా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు క్రిష్. అలాగే మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం ఒక్కడు ని రాణా తో రీమేక్ చేయటానికి వర్మ ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా గుణ శేఖర్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం త్వరలో బాలీవుడ్ లో రీమేక్ కానుంది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఈ చిత్రాన్ని హిందీలో డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Rana is very excited about his Bollywood film ‘Department’ in which he essayed the role of newly joined police cop, Sanjay Dutt will be seen as a senior police officer and Amitabh Bachchan as a politician. ‘Department’ is about a special police department recruited to operate and control the Mumbai mafia when it had grip on the city. According to Rana, ‘Department’ is a classic police drama.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X