»   » దగ్గుపాటి రానా వాయిస్ ఓవర్ తో...

దగ్గుపాటి రానా వాయిస్ ఓవర్ తో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోలు వేరే వారి చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది కామన్ గా మారింది. మహేష్ బాబు...జల్సా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాకు మరింత క్రేజ్ తెచ్చారు. అది మొదలు చిన్నా,పెద్దా అన్ని సినిమాలకూ ఎవరో ఒకరు వాయిస్ ఓవర్ ఇస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వంతు దగ్గుపాటి రానా కు వచ్చింది.దగ్గుపాటి రానా తమ బ్యానర్ లో తండ్రి సురేష్ బాబు నిర్మిస్తున్న 'భీమవరం బుల్లోడు' చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా ప్రారంభంలో ఈ వాయిస్ ఓవర్ వస్తుంది. కథని పరిచయం చేయటానికి ఈ వాయిస్ ఓవర్ ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

సునీల్ హీరోగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న 'భీమవరం బుల్లోడు' సినిమా ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 14న విడుదల కాలేదు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉండటంతో వాయిదా వేసారు. అయితే ఇప్పుడా సినిమాని 27 న విడుదల చేయటానికి నిర్ణయించారని సినీ వర్గాల సమాచారం. ఆ రోజున భారీ ఎత్తున సునీల్ కెరీర్ లోనే ఎక్కువ థియోటర్స్ లో విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు.ఎస్తేర్‌ హీరోయిన్. ఉదయ్‌శంకర్‌ దర్శకుడు. డి.సురేష్‌బాబు నిర్మాత.

 Rana lends voice to 'Bheemavaram Bullodu'

సునీల్ మాట్లాడుతూ...మా బుల్లోడుకి పెళ్లి చేయాలనేది ఇంట్లో వాళ్ల కోరిక. వాడు ఏ అమ్మాయిని చూసి నచ్చింది అంటే సరి ఆమెకి మరొక మంచి సంబంధం వచ్చి పెళ్లి కుదిరిపోతుంది. దీంతో చుట్టు పక్కల వూళ్ల వాళ్లందరూ మా అమ్మాయిని చూసి ఒక్కసారి నచ్చిందని చెప్పు బాబు అంటూ వెంటపడతుంటారు. ఇలాంటోడికి మరి పెళ్లి ఎలా అవుతుంది.. దీనికి సమాధానం తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు‌.
నిర్మాత మాట్లాడుతూ ''మహాశివరాత్రి కానుకగా... భీమవరం బుల్లోడు థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఏయే అంశాల కోసం సునీల్‌ సినిమాకి వస్తారో, అవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. సినిమా బాగా వచ్చింది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపుదిద్దుకుంది. ఆడియోలో లేని కొత్త పాటను సినిమాలో జత చేశాం'' అన్నారు.


దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ- భీమవరం బుల్లోడు చిత్రం తో మరోసారి ఈ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని, సునీల్ పాత్ర వైవిధంగా ఉంటుందని తెలిపారు. భీమవరం నివాసి అయిన సునీల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈ పేరు పెట్టడం విశేషమని, పాడింగ్ ఆర్టిస్టులందరూ చిత్రంలో నటిస్తున్నారని అన్నారు.

తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కథ:కవి కాళిదాస్, మాటలు:శ్రీధర్ శీపన, కెమెరా:సంతోష్‌రాయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.

English summary

 
 Rana has given a voice-over in beginning of Bheemavaram Bullodu film. The film is produced by his father D Suresh Babu.Directed by Uday Shankar, it has Esther as Sunil's heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu