»   » ‘ఖైదీ నెం 150’ ఫంక్షన్ హోస్ట్ చేయబోయేది ఆ ఇద్దరు స్టార్సే!

‘ఖైదీ నెం 150’ ఫంక్షన్ హోస్ట్ చేయబోయేది ఆ ఇద్దరు స్టార్సే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఖైదీనంబ‌ర్ 150 సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుదలైన టీజ‌ర్, మేకింగ్ వీడియో స‌హా అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు, 'సుందరి' ఆడియో సాంగ్స్ కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ఆడియో వేడుక నిర్వహించక పోయినా... అంతకంటే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసారు. జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడలో ఖైదీనంబ‌ర్ 150 ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ అభిమానులు, సినీప్ర‌ముఖుల మ‌ధ్య‌ గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని చిత్ర‌నిర్మాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

విజయవాడలో జరుగనున్న ఈ ఫంక్షన్‌కు మెగా హీరోలందరూ వస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నారా? లేదా? అనే విషయమై క్లారిటీ లేదు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటేఈ మెగా ఈవెంట్‌కు హోస్ట్‌లుగా రానా దగ్గుబాటి, నవదీప్‌ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

టీజర్

ఖైదీ నెం 150 సినిమా అంచనాలు భారీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌ కు యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ రావడమే ఇందుకు నిదర్శనం.

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు

ఖైదీ నెం 150 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కేవలం 24 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచించింది.

అమ్మడు సాంగ్ మేకింగ్

సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్లు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాను బేస్ చేసుకుని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

సుందరి సాంగ్

‘ఖైదీ నెం 150'లోని మరో పాట ‘సుందరి' ఈ నెల 24న రిలీజ్ చేసారు. ఆ పాటపై మీరూ ఓ లుక్కేయండి మరి.

English summary
As per latest reports, young actors Rana Daggubati and Navdeep have been roped in to anchor for Khaidi No 150 pre-release event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu