»   »  నాగ చైతన్య సాహసానికి తోడుగా రానా కూడా!

నాగ చైతన్య సాహసానికి తోడుగా రానా కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య, గౌతం మీనన్, ఏఆర్ రెహమాన్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన ‘ఏ మాయ చేసావే' చిత్రం అప్పట్లో క్లాసికల్ హిట్ గా నిలిచి పోయింది. తాజాగీ ఈ ముగ్గురి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్లో ‘సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమా రాబోతోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసారు.

ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం షూటంగ్ పూర్తయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరో రానా కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రోడ్డుపై బైక్ ఉండటాన్ని బట్టి ఇదొక అడ్వెంచరస్ రోడ్ ట్రిప్పుకు సంబంధించిన కాన్సెప్టుతో సాగుతుందని స్పష్టమవుతోంది.

Rana to play cameo in Naga Chaitanya's movie

అయితే టైటిల్ లోగోలో ‘సాగిపో'..అనేది ‘పారిపో' అనిపించేలా డిజైన్ చేసారు. దీన్ని బట్టి సినిమాలో సాహసం శ్వాసగా సాగిపోతాడా... లేక పారిపోతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ‘ఏ మాయ చేసావె' చిత్రం తెలుగులో నాగ చైతన్య, తమిళంలో శింబు చేసినట్లే.... ‘సాహసం శ్వాసగా సాగిపో' కూడా తెలుగులో చైతన్య, తమిళంలో శింబు చేయబోతున్నారు. ‘ఏ మాయ చేసావె' టైటిల్ మాదిరిగానే ఈ టైటిల్ కూడా ఒక్కడు మూవీ సాంగ్ లిరిక్ నుండి తీసుకున్నదే కావడం గమనార్హం.

ఈ సినిమాకు ఎం రవీందర్ రెడ్డి నిర్మాత. సునితా తాటికి చెందిన గురు ఫిల్మ్స్ బేనర్లో కోన వెంకట్ సమర్పకుడిగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రానికి గౌతం మీనన్ దర్శకత్వం వహించనున్నారు.

English summary
Naga Chaitanya has been busy shooting for a romantic action entertainer Saahasam Swaasaga Saagipo which is being directed by Gautham Vasudev Menon. According to the latest update, Tollywood hunk Rana Daggubati will play a cameo in this film. It is known that Rana and Chay are relatives and share good rapport between them.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu