twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగులు మార్చే బూటక బాబు..రానా

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'రంగ మార్తాండ బీటెక్‌ బాబూ... రంగులు మార్చే బూటక బాబు..' అంటూ రానా, రఘుభాబులపై రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాటను రీసెంట్ గా తెరకెక్కించారు. బుర్రా సాయిమాధవ్‌ సాహిత్యానికి బృంద నృత్యరీతులు సమకూర్చారు. దగ్గుబాటి రానా హీరోగా, క్రిష్ దర్శకత్వంలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. ఈ చిత్రం కోసమే ఈ పాటను షూట్ చేసారు. దర్శకుడు మాట్లాడుతూ ''సురభి నాటక బృందంతో ఉండే బాబు అనే యువకుడి ఆలోచనల చుట్టూ కథ నడుస్తుంది. అతని భావజాలం ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుంది. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది''అన్నారు.

    అలాగే పాట సిట్యువేషన్ గురించి చెపుతూ..."రోజుకో రంగు మార్చే వాళ్లందరూ వూసరవెల్లి తరహా అనుకొంటే ఎలా? నిత్యం రంగులతో జీవితం గడిపే బీటెక్‌ బాబులాంటి నాటకాల రాయుళ్లూ ఉండొచ్చు. బూటకపు మాటలు చెప్పే కొందరు నాయకుల కంటే ఈ బాబు నాలుగు ముక్కలు ఎక్కువే మాట్లాడతాడు. అయితే ఆ మాటలకో లెక్క ఉంటుంది. ఈ బాబు కథేంటో తెర మీదే చూడాలంటన్నారు క్రిష్‌. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. రానా, నయనతార జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రానా బిటెక్ బాబు గా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు. మైనింగ్ మాపియా మీద యుద్దం ప్రకటించే కుర్రాడిగా రానా కనిపిస్తాడని, అతను ఈ చిత్రంలో నాటకాలు వేస్తాడ"ని అంటున్నారు.

    క్రిష్ మీడియాతో రానా పాత్ర గురించి మాట్లాడుతూ..."అతని పేరు బాబు. చదివింది బీటెక్‌. అందుకే అన్నీ హైటెక్‌ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. అసలింతకీ ఈ బీటెక్‌ బాబు కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే" అన్నారు.

    "ఒక మంచి స్క్రిప్ట్ నమ్మి గమ్యం చేశాను. మళ్ళీ అదే టీమ్‌తో ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా వుంది. ఖైదీ సినిమా చిరంజీవి గారికి ఎలా అయితే టర్నింగ్ పాయింట్ అయిందో, ఈ సినిమా రానాకు, నాకూ అలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా కథ ఐడియా జస్ట్ రెండు నిమిషాల్లో వచ్చింది. వెంటనే రానాకు ఫోన్ చేసి చెప్పాను. అతను మాత్రమే ఈ కథకు సూట్ అవుతాడు. గమ్యం, వేదంలలో గాలి శీను, కేబుల్ రాజును చూపించిన విధంగానే ఇందులో రానాని బీటెక్ బాబుగా చూపిస్తున్నాను. ఇది యాక్షన్ అడ్వెంచర్ మూవీ" అని అన్నారు.

    ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్‌ బాబు మాస్‌ అయితే దేవిక క్లాస్‌. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.

    హీరో రానా మాట్లాడుతూ..."ఇది నాకు ఆరో సినిమా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నా కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పాత్రను చేస్తుండటం చాలా ఆనందంగా వుంద"ని అన్నారు. 'గమ్యం', 'వేదం'.. ఇవి రెండూ జీవితాల్లోంచి పుట్టిన కథలు. ఇది కూడా అలాంటిదే. అయినా వాణిజ్య అంశాలకు కొదవ ఉండదు''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    
 Rana, Nayanthara starring 'Krishnam Vande Jagadgurum' movie directed by Krishh is in production stage. Currently the film shooting is going on in Ramoji film city. The movie unit is canning an Song on lead cast of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X