»   » బాహుబలి : తొలి అవార్డు దక్కించుకున్న రానా

బాహుబలి : తొలి అవార్డు దక్కించుకున్న రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమాలో భల్లాలదేవుడుగా మెప్పించిన రానా దగ్గుబాటి తొలి అవార్డు అందుకోబోతున్నాడు. సౌతిండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఏసియావిజన్ మూవీ అవార్డ్స్-2015 లకు రానా ఎంపికయ్యాడు. తెలుగు విభాగంలో పెర్ఫార్మెర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రానా దక్కించుకున్నారు. డిసెంబర్ 2న దుబాయ్ లో జరిగే వేడుకలో రానా ఈ అవార్డు అందుకోబోతున్నాడు. ఏసియావిజన్ మూవీ అవార్డ్స్ ఇది 10 ఎడిషన్. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా అవార్డు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవార్డులకు సంబంధించిన వివరాలు

రానా త్వరలో ప్రారంభం అయ్యే బాహుబలి 2 షూటింగుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి-ది బిగినింగ్' భారీ విజయం సాధించడంతో పార్ట్-2 షూటింగుకు మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. బాహుబలి చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా వసూళ్లు సాధించింది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 14న ఫార్మల్ గా పూజా కార్యక్రమాలతో ‘బాహుబలి-2' షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు పండితులు ముహూర్తం ఖరారు చేసారు. సెకండ్ పార్ట్ కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. మొత్తం 170 నుండి 190 వర్కింగ్ డేస్ లలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసారు.


Rana wins Asiavision Movie Award

యూనిట్ సభ్యులు ప్రతి షెడ్యూల్ కు మధ్య 10 నుండి 20 రోజులు బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ప్రభాస్ మొత్తం 10 నెలల పాటు ఈ షూటింగులో గడపనున్నాడు. 2016 సంవత్సరం మొత్తం ‘బాహుబలి-2' షూటింగులో గడిచిపోనున్న నేపథ్యంలో ప్రభాస్ ఇతర సినిమాలేవీ కమిట్ కావడం లేదు.


‘బాహుబలి-1' భారీ విజయం సాధించడంతో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈనేపథ్యంలో రాజమౌళి రెండో పార్టును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాహుబలి 1 కంటే రెండో పార్టు కోసం బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారట. సెకండ్ పార్టులో కొన్ని అడిషనల్ క్యారెక్టర్లు కూడా క్రియేట్ చేసినట్లు సమాచారం. సౌత్ తో పాటు బాలీవుడ్ నుండి పలువురు స్టార్స్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.


‘బాహుబలి-2'ను 2016లో విడుదల చేస్తామని రాజమౌళి అండ్ టీం గతంలో ప్రకటించినప్పటికీ అనుకున్న సమయానికి వచ్చే ఏడాది సినిమా రావడం లేదని తేలి పోయింది. ‘బాహుబలి-2' విడుదల సాధ్యమయ్యేది కేవలం 2017లోనే అంటున్నారు ఆచిత్ర యూనిట్ సభ్యులు.

English summary
Rana joins the celebrations as he has been chosen for a global honour. The actor will be awarded at the Asiavision Movie Awards 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu