»   » మిస్టరీ గర్ల్‌తో రణ్‌బీర్ రొమాన్స్.. ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్!

మిస్టరీ గర్ల్‌తో రణ్‌బీర్ రొమాన్స్.. ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఓ మిస్టరీ గర్ల్‌తో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. రణ్‌బీర్‌తో అతిసన్నిహితంగా ఉన్న యువతి ఎవరనే ప్రశ్న మీడియాలో విస్తృతంగా లేవనెత్తుతున్నది. అయితే రణ్‌బీర్ రొమాన్స్ చేసింది నిజ జీవితంలో కాదు. అండర్ వేర్‌కు సంబంధించిన వ్యాపార ప్రకటన కోసం ఓ మోడల్‌తో ఇంటీమసి సీన్లలో నటించాడు. ఈ వ్యాపార ప్రకటనకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

యాడ్ కోసం మిస్టరీ గర్ల్‌తో

యాడ్ కోసం మిస్టరీ గర్ల్‌తో

మిస్టరీ గర్ల్‌తో రణ్‌బీర్ కపూర్ అతి సన్నిహితంగా ఉంటూ షూట్ చేసిన భాగాలు ఓ అండర్ వేర్ కంపెనీకి సంబంధించిన వ్యాపార ప్రకటన అని తెలిసింది. ఈ యాడ్ ఫిలింను ఓ ప్రముఖ అడ్వర్టయిజింగ్ కంపెనీ షూట్ చేస్తున్నది.

కత్రినా కైఫ్ కంటే..

కత్రినా కైఫ్ కంటే..

గతంలో తన ప్రేయసి కత్రినా కైఫ్‌తో కలిసి రణ్‌బీర్ ఐబిజా ప్రాంతానికి విహారానికి వెళ్లాడు. అప్పట్లో ఆ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు మీడియాలో సంచనలనం రేపాయి. ప్రస్తుతం వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఫొటోలు కూడా అంత కంటే ఎక్కువ వైరల్‌గా మారాయి. రణబీర్, మోడల్ కలిసి ఉన్న ఫొటోలు చాలా హాట్ హాట్‌గా అభిమానులు పిచ్చెక్కిస్తున్నాయి.

తల్లి నీతూ పెళ్లి సంబంధాలు..

తల్లి నీతూ పెళ్లి సంబంధాలు..

కాగా బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ అయిన రణ్‌బీర్ కపూర్‌కు తన తల్లి నీతూ కపూర్ పెళ్లి చేయాలనే ప్రయత్నంలో ఉన్నది. ఇటీవల పెళ్లి సంబంధాల కోసం నీతూ కపూర్ లండన్‌కు వెళ్లిందనే వార్తలు మీడియాలో కనిపించాయి.

సంజయ్ దత్ బయోపిక్‌లో..

సంజయ్ దత్ బయోపిక్‌లో..

ప్రస్తుతం రణ్‌బీర్ జగ్గా జాసూస్ చిత్రంలో, సంజయ్ దత్ బయోపిక్‌లో నటిస్తూనే వ్యాపార ప్రకటనలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన్ ముఖర్జీ రూపొందించే డ్రాగన్ అనే చిత్రంలో కూడా రణబీర్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆలియాభట్ హీరోయిన్‌గా నటిస్తున్నది.

బ్రాండ్ అంబాసిడర్‌గా

బ్రాండ్ అంబాసిడర్‌గా

సినిమాలు, అడ్వర్టైజింగ్ రంగంలోనే కాకుండా పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ట్రావెల్ పోర్టల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్టు ఓ ప్రకటన వెలువడింది.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గతంలో ట్రావెలింగ్ కథా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించాను. యాత్ర సంస్థతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. నా అభిరుచికి దగ్గరగా ఉంది అని రణబీర్ ఓ ప్రకటనలో తెలిపారు.

English summary
Ranbir Kapoor is back in news, but not for his upcoming film Jagga Jasoos. The 34-year-old actor was recently spotted getting intimate with a mystery woman and the photos of the two have gone viral. Well, before you start overthinking, these photos are from a commercial shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu