»   » ప్రేక్షకులు తట్టుకుంటారా? కత్రినా-రణబీర్ మూవీ గురించి షాకింగ్ న్యూస్!

ప్రేక్షకులు తట్టుకుంటారా? కత్రినా-రణబీర్ మూవీ గురించి షాకింగ్ న్యూస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కొన్ని సార్లు సినిమాల్లో ఉండే నాలుగైదు పాటలే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంటాయి. హాట్ సీన్లు, కామెడీతో ఉండే పాటల సంగతి వేరనుకోండి. పాటలు ఎంత ఆసక్తికరంగా ఉన్నా వాటి సంఖ్య ఎక్కువగా ఉంటే భరించడం కష్టమే. అయితే బాలీవుడ్లో రాబోతున్న 'జగ్గా జాసూస్' చిత్రంలో ఏకంగా 29 పాటలు ఉన్నాయట.

సూపర్‌గా ఉంది, ఇండియాలో ఫస్ట్ టైం: 'జగ్గా జాసూస్' స్నీక్ పీక్ (వీడియో )

బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన పోస్టర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు బాగా పెంచాయి. ఒకప్పుడు ప్రేమికులైన ఈ ఇద్దరూ... విడిపోయి ఇపుడు సినిమా కోసం కలిసి నటించడం కూడా సినిమాకు కలిసొచ్చే అంశమే.

Ranbir Kapoor-Katrina Kaif's Jagga Jasoos To Feature 29 Songs

అంతా బాగానే ఉంది కానీ... సినిమాలో ఏకంగా 29 పాటలు ఉన్న విషయం విని అందరూ షాకవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న ప్రీతమ్ వెల్లడించడం విశేషం.

సినిమా వివరాల్లోకి వెళితే ఇదో మ్యూజికల్ అడ్వంచర్ రొమాంటిక్ ఫిల్మ్. హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అనురాగ్ బసు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యారు. యూటీవీ మోషన్ పిక్చర్స్ అధినేత సిద్ధార్థరాయ్ కపూర్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక యంగ్ డిటెక్టివ్ మిస్సయిన తన తండ్రి వెతుక్కుంటూ వెళ్లి ఎలాంటి సాహసాలు చేసాడు అనే కాన్సెప్టుతో ఈ సినిమా సాగుతుంది.

English summary
Music director Pritam confirmed that Ranbir-Katrina's much awaited Jagga Jasoos will have 29 songs and even revealed the reason behind it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu