»   » జిరాక్స్ కాపీలా ఉన్నాడు: సంజయ్ దత్ బయోపిక్ లో రణబీర్ లుక్ లీక్ (ఫోటోస్)

జిరాక్స్ కాపీలా ఉన్నాడు: సంజయ్ దత్ బయోపిక్ లో రణబీర్ లుక్ లీక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితంలో ఉన్నన్ని వివాదాలు మరో హీరోకు లేవు. పలు కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి జైలు జీవితం కూడా అనుభవించాడు సంజయ్. ఇక పలువురు హీరోయిన్లతో సంజయ్ దత్ ఎఫైర్ల గురించి ఓ పుస్తకమే రాయొచ్చు.

అలాంటి సంజయ్ దత్ జీవితంలో జరిగిన సంఘటనల వెనక ఉన్న కారణాలు ఏమిటి? అసలు సంజయ్ దత్ ఎలాంటి వాడు? అనే విషయాలను ఆవిష్కరిస్తూ అతడి జీవితంపై బాలీవుడ్లో ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్

ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫోటోల్లో రణబీర్ కపూర్ సంజయ్ దత్ కు జిరాక్స్ కాపీలా ఉండటం చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

అన్ని వివాదాలు ఉంటాయా?

అన్ని వివాదాలు ఉంటాయా?

సంజయ్ దత్ పుట్టుక దగ్గర నుండి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో స్నేహం, అతడి వల్ల అక్రమ ఆయుధాల కేసులో ఇరుక్కోవడం...హీరోయిన్లతో ఎఫైర్లు ఇలా సంజయ్ దత్ జీవితంలోని అన్ని వివాదాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు.

సత్తా ఉన్న దర్శకుడే

సత్తా ఉన్న దర్శకుడే

సంజయ్ దత్ తో మున్నా భాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నా భాయ్ సినిమాలతో పాటు 3 ఇడియట్స్, పెకె లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

రణబీర్ హార్డ్ వర్క్

రణబీర్ హార్డ్ వర్క్

తాను తీస్తున్న సంజయ్ దత్ బయోపిక్ కోసం రణబీర్ కపూర్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని, రేపు సినిమా రిలీజైన తర్వాత తెరపై మనకు రణబీర్ కనిపించడు... సంజయ్ దత్ కనిపిస్తాడు, అంత అద్భుతంగా రణబీర్ చేస్తున్నాడని రాజ్ కుమార్ హిరానీ ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో ప్రశంసలు గుప్పించారు.

వారి పాత్రలు కూడా ఇందులో...

వారి పాత్రలు కూడా ఇందులో...

ఈ చిత్రంలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటిస్తుండగా..... నర్గీస్ పాత్రలో మనీషా కొయిరాలా, మాన్యతా దత్ పాత్రలో దియా మీర్జా, టీనా మునిమ్ పాత్రలో సోనమ్ కపూర్, మాధురి దీక్షిత్ పాత్రలో కరిష్మా తన్నా నటిస్తున్నారు.

రిలీజ్ ఎప్పుడు?

రిలీజ్ ఎప్పుడు?

రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్, విదు వినోద్ చోప్రా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాది చివర్లో లేదా... 2018లో ఈ సినిమా విడుదలయ్యే అవకావం ఉంది.

English summary
Ever since Ranbir Kapoor has stepped into the shoes of Sanjay Dutt for his biopic we can't wait to watch him on 70mm screen! Now, we have got our hands on the latest pictures of Ranbir Kapoor from the sets of the 'Dutt' biopic and boy, we just couldn't believe our eyes! Ranbir Kapoor is looking nothing but a carbon copy of Sanjay Dutt and we cannot keep calm! His pictures are going viral on the social media and it's totally worth seeing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu