»   » రికార్డు స్థాయిలో ‘రంగస్థలం’ రిలీజ్, ఎక్కడెక్కడ ఎన్ని స్క్రీన్లంటే...

రికార్డు స్థాయిలో ‘రంగస్థలం’ రిలీజ్, ఎక్కడెక్కడ ఎన్ని స్క్రీన్లంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' చిత్రం మార్చి 30న విడుదలకు సిద్ధమైంది. సినిమా రిలీజ్ ముందు నుండే భారీగా హైప్ రావడంతో డిమాండ్‌కు తగిన విధంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. తొలి రోజు షోలకు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

Rangasthalam Satellite Rights Are Marvelous

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ కావడం, టీజర్, ట్రైలర్, పాటలు సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై ప్రేక్షుకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసి ఫస్ట్ వీక్‌లోనే భారీ కలెక్షన్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

భారీగా థియేటర్ల కేటాయింపు

భారీగా థియేటర్ల కేటాయింపు

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణాల్లో 650 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. కర్నాటక, చెన్నై, ముంబై, రెస్టాఫ్ ఇండియాలో కలిసి దాదాపు 200 స్క్రీన్లు, యూఎస్ఏ, యూకె, యూఏఈలో కలిపి దాదాపు 350 స్క్రీన్లలో ‘రంగస్థలం' విడుదల కాబోతోంది.


మరిన్ని స్క్రీన్ల కోసం

మరిన్ని స్క్రీన్ల కోసం

ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ దాదాపు 1200 స్క్రీన్లు ఫైనల్ అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్లు మరిన్ని థియేటర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రిలీజ్ సమయానికి మరిన్ని స్క్రీన్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
వారం ముందు నుండే

వారం ముందు నుండే

వారం ముందు నుండే ‘రంగస్థలం' టికెట్స్ బుకింగ్ మొదలైంది. అన్ని ప్రాంతాల్లో తొలి రోజుకు సంబంధించి టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. బుక్ మై షో లాంటి సైట్లలో టికెట్లు అమ్మకానికి పెట్టిన కొన్ని గంటల్లోనే అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 శాతం టికెట్లు అడ్వాన్డ్‌గా బుక్ అయ్యాయి. విడుదల సమయానికి 90 శాతానికి పైగా రీచ్ ఉంటుందని ఆశిస్తున్నారు.


చెన్నైలో భారీగా

చెన్నైలో భారీగా

బెంగులూరు, చెన్నై, ముంబై లాంటి ప్రాంతాల్లో 35 శాతం టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. ఇందులో ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే... చెన్నైలో ఇతర నాన్ తెలుగు సిటీల కంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.


యూఎస్ఏలో ఒక రోజు ముందే

యూఎస్ఏలో ఒక రోజు ముందే

ఇక ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఒక రోజు ముందుగా అంటే మార్చి 29న విడుదల కాబోతోంది. గురువారం భారీ స్థాయిలో ఇక్కడ ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నారు. ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు 55 శాతం అడ్వాన్స్ గా బుక్ అయిపోయాయి.
English summary
Director Sukumar's Rangasthalam starring Ram Charan is set to be released, March 30. The movie which has created a lot of pre-release buzz will be released in a record number of screens. It has received fantastic advance booking across the world for the first day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X