»   » రంగమ్మత్త విందు భోజనం... పార్టీలో మునిగితేలిన అనసూయ!

రంగమ్మత్త విందు భోజనం... పార్టీలో మునిగితేలిన అనసూయ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rangasthalam Casted By Anasuya Gave Party To Her Co-stars

'రంగస్థలం' సినిమాలో బాగా హైలెట్ అయిన పాత్ర రంగమ్మత్త. హీరో, హీరోయిన్, విలన్ తర్వాత..... ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే రోల్ ఇది. రంగమ్మత్త పాత్ర చేసే అవకాశం దక్కించుకున్న అనసూయ జాక్ పాట్ కొట్టిందనే చెప్పాలి. ఇది ఆమెకు కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. నటిగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత అనసూయ ఎన్నడూ అందుకోనన్ని ప్రశంసలు ఈ పాత్ర చేయడం ద్వారా అందుకున్నారు.

పార్టీలో మునిగి తేలిన అనసూయ

రంగస్థలం సినిమా హిట్ కావడం, ఈ చిత్రంలో తన పాత్రకు అద్భుతమైన గుర్తింపు రావడంతో చాలా సంతోషంగా ఉన్న అనసూయ... రంగస్థలంలో తనతో పాటు కలిసి నటించిన వారిని పిలిచి పార్టీ ఇచ్చింది. అనసూయ ఏర్పాటు చేసిన ఈ విందులో రంగస్థలం గ్రామస్తులుగా నటించిన పలువురు పాల్గొన్నారు.

కెరీర్ టర్నింగ్ రోల్

కెరీర్ టర్నింగ్ రోల్

'రంగమ్మత్త' పాత్ర అనసూయకు కెరీర్ టర్నింగ్ రోల్ అని చెప్పక తప్పదు. అప్పటి వరకు అనసూయ అంటే గ్లామర్ పాత్రలు, నాటీ యాటిట్యూడ్ ఉండే పాత్రలు చేయగలదనే అభిప్రాయం మాత్రమే ఉంది. అయితే 'రంగమ్మత్త' పాత్రతో ఆమెను ఇంకా చాలా రకాలుగా తెరపై చూపించవచ్చే అభిప్రాయానికి వచ్చారు ఫిల్మ్ మేకర్స్. ప్రేక్షకులు కూడా రంగమ్మత్తగా అనసూయ పెర్ఫార్మెన్స్ చూసి ముగ్దులైపోయారు.

అసలు ఊహించలేదు

అసలు ఊహించలేదు

"రంగమ్మత్త పాత్ర గురించి దర్శకుడు సుకుమార్ నాకు చెప్పినపుడు ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో అని నాకు తెలియదు. తెలిసిన తర్వాత షాకయ్యాను. రామ్ చరణ్ నా ఫేవరెట్ స్టార్... ఆయనతో అత్త అని పిలిపించుకోలేను అని చెప్పాను. పాత్ర పేరు రంగమ్మగా మార్చాని కోరారు. కానీ అత్త అని పిలిస్తే తప్ప సీన్ పండదు అని చెప్పడంతో చేయక తప్పలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత నా పాత్రకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు, ఇపుడు రంగమ్మత్త అని పిలిపించుకోవడం సంతోషంగా ఉంది అని అనసూయ తెలిపారు.

ఫీలింగ్ గ్రేట్

ఫీలింగ్ గ్రేట్

సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ రంగమ్మత్తగా చాలా బాగా చేశారని ప్రశంసిస్తున్నారు. మా ఆయన నుండి కూడా పొగడ్తలు వచ్చాయి. నా కెరీర్లోనే రంగమ్మత్త ది బెస్ట్ రోల్ అని ఆయన అనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నా జీవితంలో పొందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే. ఈ సినిమాలో నాకు అవకాశం రావడం చాలా గొప్పగా ఫీలవుతున్నాను అని అనసూయ అంటున్నారు.

English summary
Rangasthalam assistant costume designer Gauri Naidu has posted a picture on her social media where she captioned it as “Rangammatha Vindhu Bhojanam.” The picture is currently going viral on the social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X