రంగస్థలం పేరుతో ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసారుగా!
ప్రస్తుతం ఎక్కడ చూసిన రంగస్థలం చిత్రం గురించే చర్చ జరుగుతోంది. శుక్రవారం ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా రంగస్థలం టైటిల్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ కు ఆ పేరు పట్టారు. దీనితో రంగస్థలం అనే రెస్టారెంట్ ని హైదరాబాద్ లోని కొంపల్లిలో ఇటీవల ఓపెన్ చేసారు.
దీనితో సదరు రెస్టారెంట్ ఓనర్ కు రూపాయి ఖర్చు లేకుండా మంచి పబ్లిసిటీ లభించింది. అంతా రంగస్థలం టైటిల్ మహిమే. ఆ ప్రాంతంలోని వారంతా ఈ రెస్టారెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ రెస్టారెంట్ వైరల్ గా మారుతోంది. రంగస్థలం చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా రెస్టారెంట్ కు ఈ పేరు పెట్టారా లేక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలు తెలియలేదు. ఏదైతే నేం రాంచరణ్ నటించిన రంగస్థలం మానియా సర్వత్రా స్పష్టంగా కనిపిస్తోంది.



Click it and Unblock the Notifications











