»   » రంగస్థలం ఎఫెక్ట్: కాజల్ రికార్డ్ సమం చేసిన సమంత... నయనతార సున్నా!

రంగస్థలం ఎఫెక్ట్: కాజల్ రికార్డ్ సమం చేసిన సమంత... నయనతార సున్నా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rangastalam Reaches 100cr Club...!

తెలుగులో మోస్ట్ సక్సెస్‍‌ఫుల్ హీరోయిన్ల లిస్టు తీసుకుంటే అందులో టాప్ పొజిషన్లో ఉండే హీరోయిన్ సమంత. ఆమె నటించిన తాజా చిత్రం 'రంగస్థలం' బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఇండస్ట్రీలో పలు రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళుతోంది.

కాజల్ రికార్డు సమం చేసిన సమంత

కాజల్ రికార్డు సమం చేసిన సమంత

‘రంగస్థలం' 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో..... సమంత ఖాతాలో మరో రూ. 100 కోట్ల సినిమా పడింది. సామ్ నటించిన చిత్రాల్లో ఈ మార్కును అందుకున్న 8వ చిత్రం ‘రంగస్థలం'. ఇప్పటి వరకు ఈ రికార్డు హీరోయిన్ కాజల్ పేరు మీద ఉండగా.... సమంత ఇపుడు దాన్ని సమం చేసింది.

సమంత ఖాతాలో 8 చిత్రాలు

సమంత ఖాతాలో 8 చిత్రాలు

సమంత కెరీర్లో రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన తొలి చిత్రం మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘దూకుడు'. ఆ తర్వాత సూర్య ‘24', విజయ్ ‘కత్తి', ‘తేరి', ‘మెర్సల్', పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది', జూ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్' చిత్రాలు ఉన్నాయి.

పెళ్లైన హీరోయిన్లు సినిమాలకు పనికిరారు అని ఇక ఎవరూ అనరేమో

పెళ్లైన హీరోయిన్లు సినిమాలకు పనికిరారు అని ఇక ఎవరూ అనరేమో

అంతే కాదు... పెళ్లయిన తర్వాత రెండు 100 కోట్ల సినిమాల్లో నటించిన హీరోయిన్‌గా సమంత రికార్డుల కెక్కింది. పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు పనికిరారు అనే అపోహ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. వరుస హిట్లు కొడుతూ సమంత ఆ అపోహను చెరిపేసింది.

తర్వాతి స్థానాల్లో శృతి హాసన్, అనుష్క

తర్వాతి స్థానాల్లో శృతి హాసన్, అనుష్క

కాజల్, సమంత తర్వాత హీరోయిన్ శృతి హాసన్ ఏడు సినిమాలతో తర్వాతి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఐదు చిత్రాలతో హీరోయిన్ అనుష్క శెట్టి ఉన్నారు. నిత్యా మీనన్ ఖాతాలో 3 సినిమాలు ఉన్నప్పటికీ ఆ మూడు చిత్రాల్లో ఆమె సెకండ్ హీరోయిన్‌గా నటించింది.

నయనతార సున్నా

నయనతార సున్నా

సౌతిండియాలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. అయితే నయనతార ఖాతాలో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా 100 కోట్లు వసూలు చేసింది లేక పోవడం గమనార్హం. సైరా చిత్రంతో ఆమె 100 కోట్ల లిస్టులో చేరుతుందేమో...

English summary
Samantha has one more hit to her credit at the box office in the form of Rangasthalam. With the success of the Ram Charan's film, she now has eight films that have breached the Rs 100-crore mark at the box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X