»   » అందుకే ఆ సింగర్‌ను పక్కన పెట్టాం: రంగస్థలం పాట వివాదంపై సుకుమార్!

అందుకే ఆ సింగర్‌ను పక్కన పెట్టాం: రంగస్థలం పాట వివాదంపై సుకుమార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Singer Sivanagulu Is Quite Unhappy With Rangasthalam

'రంగస్థలం' సినిమాలో బాగా హైలెట్ అయిన అంశాల్లో సంగీతాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఆడియో ఆల్బం సూపర్ హిట్ అవ్వడం సినిమాకు మరింత ప్లస్ అయింది. అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలోని పాటపై వివాదం నెలకొనడం, ఆ పాట పాడిన సింగర్ మీడియా వరకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. చివరకు దీనిపై దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు.

ఏమిటి వివాదం?

ఏమిటి వివాదం?

ఈ చిత్రంలో ‘ఆగట్టునుంటావా నాగన్న ఈ గట్టకొస్తావా' అనే పాటను ఫోక్ సింగర్ శివ నాగులు పాడారు. సినిమా విడుదల ముందే ఈ పాట సూపర్ హిట్ అయింది. ఆడియో వేడుకలో కూడా సింగర్ శివ నాగులును వేదికపైకి పిలిచి అప్రిషియేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ. అయితే సినిమా విడుదలై తర్వాత అందులో శివ నాగులు వాయిస్ కాకుండా దేవిశ్రీ వాయిస్ రావడంతో అంతా షాకయ్యారు.

శివ నాగులు ఏమంటున్నారంటే...

శివ నాగులు ఏమంటున్నారంటే...

ఇలా ఎందుకు జరిగిందో తన వద్ద సమాధానం లేదు అంటున్నారు సింగర్ శివ నాగులు. దీనిపై ఆయన మాట్లాడుతూ... సినిమా ఆడియో ఫంక్షన్లో కూడా దేవిగారు నాతో చాలా బాగా మాట్లాడారు. సూపర్‌గా పాడావు అని ప్రశంసించారు. అక్కడి వరకు బాగానే ఉంది. సినిమా విడుదలైన తర్వాత మార్నింగ్ షోకు మా ఫ్రెండ్స్ అంతా వెళ్లారు. సినిమా చూసి నీ వాయిస్ కాదు అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. మధ్యాహ్నం 2 గంటల షోకు నేను వెళ్లిన చూసిన తర్వాత అది నా వాయిస్ కాదు దేవిశ్రీ వాయిస్ అని అర్థమైంది. దీని గురించి చాలా మంది నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఎందుకు ఇలా జరిగింది అంటే నా వద్ద సమాధానం లేదు.... అని శివ నాగులు అన్నారు.


నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు

నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు

ఇలా ఎందుకు మార్చారో తెలియదు. నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. నా బాధంతా ఒకటే. నాకు ఒక్క మాట ముందే చెప్పి ఉంటే గుండె ధైర్యం చేసుకుని ఉండేవాడిని. నా అభిమానులు, ఫ్రెండ్స్ చాలా మంది శివ నాగులు పాడాడు అనే సంతోషంతో వెళ్లారు. అందులో వాయిస్ లేక పోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు. వారు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేక చచ్చిపోయాను... అని ఆవేదన వ్యక్తం చేశారు.


ఏం జరిగిందో నాకు తెలియదు.

ఏం జరిగిందో నాకు తెలియదు.

ఏం జరిగిందో నాకు తెలియదు. చిన్న చిన్న వేదికలు, టీవీల్లో పాడుకునేవాళ్లం. సడెన్ గా రంగస్థలం లాంటి పెద్ద సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా నా వాయిస్ వెళ్లిపోయిందనే ఆనందంలో ఉన్నాను. అయితే సినిమాలో నా పాట లేదని తెలిసేసరికి చాలా బాధ అనిపించింది. నాకు ఒక మాట చెబితే బావుండేది అనిపించింది. అనివార్యకారణాల వల్ల ఇలా చేయడం జరిగింది అని ఒక్క మాట చెప్పి ఉంటే నేను ముందే మానిసకంగా ప్రిపేర్ అయి ఉండేవాడిని. నాలా భవిష్యత్తులో ఎవరికీ కాకూడదనే ఉద్దేశ్యంతో నేను ఈ మాట చెప్పడం జరుగింది... అని శివ నాగులు అన్నారు.
వివాదంపై సుకుమార్ స్పందన

వివాదంపై సుకుమార్ స్పందన

ఈ పాట వివాదంపై దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ.... ముందు మేము సాంగ్ షూట్ చేసేపుడు దేవిగారి వాయిస్‌తో వచ్చింది. అలానే సాంగ్ షూట్ చేశాం. ముందు సాంగ్ షూట్ చేసి తర్వాత మంచి ఫోక్ సింగర్‌తో పాడించవచ్చు అని అలా చేశాం. తర్వాత ఆల్బంలో శివనాగులు గారు పాడారు. ఆయన చాలా బాగా పాడారు. ఆయన పాడిన పాటే ఆడియో ఆల్బంలో కూడా ఉంటుంది. దాన్ని మార్చే ఉద్దేశ్యం కూడా లేదు. అయితే దేవిగారి వాయిస్‌తో షూట్ చేయడం వల్ల...... శివ నాగులు వాయిస్‌ లిప్ మ్యాచ్ కాలేదు. అక్కడక్కడ లిప్ సింక్ పోయింది. ఎంత ఫ్రేమ్స్ అడ్జెస్ట్ చేద్దామన్నా కూడా కుదరలేదు. ముఖ్యంగా ఎక్స్ ప్రెషన్ మ్యాచ్ కాలేదు.... అందుకే సినిమాలో దేవిశ్రీ వాయిసే ఉంచడం జరిగింది అని సుకుమార్ తెలిపారు.
చాలా మదన పడ్డాం

చాలా మదన పడ్డాం

ఆల్రెడీ బయట ఆల్బం వచ్చింది, ఏం చేద్దాం అని చాలా మదన పడ్డాం. తెరపై చూస్తున్న ప్రేక్షకుడు దీని వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో దేవి వాయిస్ ఉంచడం జరిగింది. ఏ పాటతో అయితే షూట్ చేశామో అదే పాటను అలా ఉంచాల్సి వచ్చింది. అదే కారణం... అంతకు మించి ఏమీ లేదు. శివ నాగులును దేవి ఎంతగానో అప్రిషియేట్ చేశాడు. శివ నాగులు వాయిసే ఉంచాలని అతడు చాలా పట్టుబట్టాడు కూడా. కానీ దేవిశ్రీ వాయిసే పెట్టడం తప్పనిసరి అయింది. ఇదో టెక్నికల్ ప్రాబ్లం. ఎవరినైనా డిసప్పాయింట్ చేసి ఉంటే వెరీ సారీ. ఆడియో ఆల్బంలో ఎప్పటికీ వినిపించేది శివ నాగులు వాయిస్ మాత్రమే.... అని సుకుమార్ తెలిపారు.


English summary
Singer Sivanagulu is quite unhappy with Rangasthalam Movie as his song ‘Aa Gattununtaava’ was replaced by that of Music Director Devi Sri Prasad himself, all of a sudden, without any prior intimation to him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X