Related Articles
సమంతను మరిపించింది: చిట్టి రామలక్ష్మి డాన్స్ పెర్ఫార్మెన్స్ వైరల్
రంగస్థలంలో మళ్ళీ సందడి.. మొదలు పెట్టిన మెగాస్టార్!
భార్య కోసం వంటింట్లో రాంచరణ్.. కొత్త హెయిర్ స్టైల్ అదిరింది!
రాంచరణ్, బోయపాటి సినిమా టైటిల్.. రోమాలు నిక్కబొడుచుకునేలా, అలాంటి కథ!
రంగస్థలం తరువాత సైరానే.. అక్కడే భారీగా!
మరో సంచలనం: రూ. 175 కోట్లు వసూలు చేసిన ‘రంగస్థలం’
ఇక దేశవ్యాప్తంగా రంగస్థలం.. బిగ్ ప్లానింగ్ ఇదే!
తండ్రిని మించిన తనయుడు: 14 రోజుల్లోనే ‘రంగస్థలం’ సెన్సేషన్
రంగస్థలం ఘనవిజయం.. కాలినడకన ఉపాసన తిరుమలకు, నాయక్ తరువాత పవన్ నేడు!
పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ‘రంగస్థలం’ విజయోత్సవం
చైతుతో ఆ విషయాలు మాట్లాడను.. అది నేర్చుకున్నా.. సమంత!
రాంచరణ్‌కు తప్పిన పెను ప్రమాదం.. ఖంగారు పడిపోయిన సుకుమార్, ఆ సన్నివేశంలో!
రాజకీయ నేపద్యంలో మెగా హీరో సినిమా, విలన్ కూడా రాజకీయనాయకుడే!

రామ్‌చరణ్, సమంత జంటగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం(మోహన్) నిర్మించిన చిత్రం రంగస్థలం. మార్చి 30న సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్బంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... చరణ్, జగపతి బాబు, అనసూయ, సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రంగ వల్లే ఇదంతా
‘‘నాన్నకు ప్రేమతో సినిమాలో కాఫీ కాఫీ అని గుర్తు చేస్తుంటే అమ్మాయికి కాఫీ తాగాలని కోరిక కలిగినట్లు..... రంగా అని చరణ్‌కు నాకూ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. తనే నన్ను చెర్రీ దగ్గరకు తీసుకెళ్లాడు. అలా మా జర్నీ అలా ప్రారంభమైంది. రంగ మా పక్క ఆఫీసులో ఉండేవాడు. ‘నాన్నకు ప్రేమతో తర్వాత నువ్వు చరణ్‌తో చేయాలి. ఆ సినిమా కొడితే ఓ రేంజిలో ఉండాలి' అని రంగ అన్నాడు. అలా అతని పేరుమీదే ఈ సినిమాకు ‘రంగస్థలం' అనే టైటిల్ వచ్చిందేమో! థాంక్యూ రంగా.... ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడానికి నువ్వే కారణం... అని సుకుమార్ అన్నారు.
జగపతి బాబు సెక్సీగా ఉన్నారు
నాన్నకు ప్రేమతో చూసిన తర్వాత ఎవరో ఫోన్ చేసి జగపతి బాబు గారు చాలా సెక్సీగా ఉన్నారని చెప్పారు. ఆయనేంటి వైట్ గడ్డం పెట్టుకుని కూడా సెక్సీగా కనిపిస్తారా? అనుకున్నాను. ఈ సినిమా చూసి పక్కా పల్లెటూరిలో పంచెకట్టి చుట్ట కాలుస్తుంటే మళ్లీ అలాంటి కాల్సే వచ్చాయి. మీరు ఏ రూపంలో ఉన్నా మీ గ్లామర్ పోవడం లేదు. బంగారం ఏ రూపంలో ఉన్నా బంగారమే కదా. ఆయన ఎంతో ముద్దొచ్చారు. నాకు ఏ మాత్రం అవకాశం ఉన్నా మీతో ప్రతి సినిమా చేయాలని ఉంది.... అని సుకుమార్ తెలిపారు.
కేవలం 20 నిమిషాల్లో పాట రాశారు
చంద్రబోస్ గారు మా లిరిసిస్ట్. ఫార్ములాస్ అన్నీ ఆయన బ్రెయిన్లో గ్రెయిన్ అయిపోయి ఉన్నాయి. ‘ఎంత సక్కగున్నావె' పాట కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేశారు. ఇది ప్రపంచం గుర్తించదగ్గ నేషనల్ అవార్డు స్థాయి లిరిక్. అంత సృజనాత్మకత యొక్క ఉచ్ఛస్థితిలో ఉన్నారు. వేరు శనగ కోసం మట్టిని తవ్వితే లంకె బిందెలు తగిలాయన్నారు. మాకు తగిలేశాయి లంకెబిందెలు. చింత చెట్టు ఎక్కి చిగురు కోబయోతుంటే చందమామ కూడా తగిలేసింది. మీ నోటి నుండి ఏ పదాలు వచ్చాయో అవి ఇపుడు నిజం అయ్యాయి.... అని సుకుమార్ అన్నారు.
నవీన్, రామకృష్ణ
ఇండస్ట్రీ ఉన్నంత కాలం నవీన్ ఎడిటర్‌గా ఉండిపోతాడు. అతడికి అన్నీ తెలుసు. ప్రతీ విషయంపై పట్టుంది. తెలుగు సినిమాకు రామకృష్ణ లాంటి ఒక ఆర్ట్ డైరెక్టర్ దొరికారో నవీన్ అద్భుతాలు చేస్తాడు... అంటూ సుకుమార్ ప్రశంసలు గుప్పించారు.
ఫిలాసఫర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ
రత్నవేలుగారి గురించి చెప్పుకుంటే ఆయన ఫిలాసఫర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఆయన స్క్రీన్ మీద పెయింటింగ్స్ వేస్తారు. ప్రతి ఫ్రేమును ఎంతో అందంగా తీర్చి దిద్దారు. ఆయన ఆలోచనా విధానమే వేరు. ఎక్కడ లైట్ ఉండాలి, ఎక్కడ లైట్ ఉండకూడదు. ఏ సీన్ ను ఏ మూడ్లో చెప్పాలి ప్రతీది సైకలాజికల్‌గా, ఫిలాసఫికల్‌గా చెబుతాడు. అతడు స్క్రీన్‌పై ఆయన ఒక రచయిత. అంత అందంగా చేస్తారు. నాదృష్టిలో ఆయన నెం.1 సినిమాటోగ్రఫర్ అని సుకుమార్ అన్నారు.
దేవీశ్రీ నా ఆత్మ
డీఎస్పీ గురించి చెప్పాలంటే ఆయన నా ఆత్మ. అతను లేకపోతే నేను లేను. నా ఆత్మకు ఒక రూపం ఉంటే.. అది సంగీతం అయితే అది దేవి. అంత బాగా అర్థం చేసుకోగలడు. నా సినిమాకు మ్యూజిక్ కు సంబంధించి చాలా తక్కువ డిస్క్రీషన్స్ ఉంటాయి. మిగతా అంతా మా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటాం. దేవి ఉంటే మ్యూజిక్ గురించి నాకు ఎలాంటి వర్రీ ఉండదు. చరణ్ కూడా చాలా బావుందన్నాడు. మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. చరణ్ ఎనిమిది సంవత్సరాలు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. తనకి ఎప్పుడు సమయం దొరికినా, పాటలు వినడు. ట్రాక్స్ వింటుంటాడు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ సాండ్ ట్రాక్స్ అతనికి తెలుసు. అలాంటి వ్యక్తి నుంచి ప్రశంస వచ్చిందంటే దటీజ్ బెస్ట్... అని సుకుమార్ అన్నారు.
రంగమ్మతగా అనసూయ ది బెస్ట్
‘రంగమ్మత్త' గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నువ్వు నన్ను బాధ పెట్టానన్నావు. కానీ అంతే ఆనంద పెట్టావు సెట్లో. నేను ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఈజీగా ఎంపిక చేసుకున్నాను కానీ ఈ కార్యక్టర్ ను అంత ఈజీగా ఎంపిక చేసుకోలేదు. చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఈ పాత్ర కోసం పెద్ద పెద్ద ఆర్టిస్టులను పది మందిని తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల నుండి తీసుకొచ్చి ఆడిషన్స్ చేశాను. ఫొటో షూట్ చేశాం. చివరకు అనసూయ పర్ఫెక్టుగా అనిపించింది.... అని సుకుమార్ తెలిపారు.
హీరోయిన్ గురించి
ఈ సినిమా చేసినప్పుడు సమంతకు పెళ్లవుతోంది. ఆమె కరెక్టా? కాదా? అనే డౌట్ ఉండేది. చిరంజీవిగారు ఒకటే మాట అన్నారు. అవన్నీ పక్కన పెట్టేసేయండి...అమ్మాయి చాలా మంచి ఆర్టిస్ట్. సినిమా కరెక్టుగా ఉంటే ప్రేక్షకులు ఆ అమ్మాయికి పెళ్లయిందా? లేదా? అని చూడరు అన్నారు. ‘ఒక హీరోయిన్‌కు పెళ్లయితే, సినిమాకు పనికి రాదు. సినిమా చేస్తే ప్రేక్షకులు చూడరు' అనే అపోహను సమంత తన నటనతో చెరిపేసింది.... అని సుకుమార్ అన్నారు.
ఆది అలా ఎలా నటించాడో తెలియదు
ఆది చెప్పిన సూచనలు సెట్లో నాకు చాలా సార్లు ఉపయోగ పడ్డాయి. అమేజింగ్ పెర్ఫార్మర్. డైలాగ్ డిక్షన్, మాడ్యులేషన్, ఆ చెప్పడం చాలా అద్భుతం. ఈ సినిమాలో ఏ పాత్రను మీరు ఐడెంటిఫై చేసుకుంటారు అంటే కుమార్ బాబు అని చెప్పాను. చిట్టిబాబు క్యారెక్టర్ తర్వాత కుమార్ బాబు పాత్ర చాలా ఇష్టం. శవంలా నటించిన సీన్లో ఒక్క షాట్ కూడా సీజీకి ఇవ్వలేదు. ఎక్కడా ఊపిరి పీల్చిన సందర్భం మాకు కనిపించలేదు. అసలు అలా ఎలా నటించాడో తెలియదు.... అని సుకుమార్ అన్నారు.
నిర్మాతల గురించి
సినిమా ఇంత గొప్పగా రావడానికి నిర్మాతల సహకారం. చాలా లిబరల్.... ఏనాడూ నేను అడిగింది కాదనలేదు. చాలా కంఫర్టుగా అనిపించింది. వేరే నిర్మాతలు అయితే ఇదేంటండీ ఈ సీన్ మళ్లీ తీస్తున్నారు. ఇదేంటి ఒక సీన్ ఎక్స్ ట్రా పెట్టారు, ఈ సీన్ అయితే బడ్జెట్ పెరిగిపోతుంది కదా లాంటి డిస్క్రషన్ ఉంటుంది. కానీ మైత్రి మూవీస్ వారు ఎప్పుడూ అలాంటి దానికి తావు ఇవ్వలేదు. వారు లిబరల్‌గా ఉండటం వల్లే సినిమా చేస్తున్నపుడే కరెక్ట్ చేసుకునే అవకాశం కలిగింది. వారు ముగ్గురు త్రిమూర్తులు కాదు బోలా శంకరులు... అని సుకుమార్ అన్నారు.
చరణ్ ఒప్పుకోవడం అత్యంత దారుణం
చిట్టిబాబు పాత్రలో చరణ్ తప్ప మరొకరిని ఊహించుకోలేను. అంత పెద్ద స్టార్‌కు కొడుకై ఉండి కూడా ‘చెవిటి మెషీన్ పెట్టుకో డార్లింగ్' అంటే మరో మాట మాట్లాడకుండా పెట్టేసుకున్నాడు. ‘ఒకస్టార్ చెవిటి మెషీన్ పెట్టుకుంటే బాగుంటుందా? లేదా? అని ఆ టైమ్‌లో నాకే సందేహం' కానీ, చరణ్‌ను నేను మోసం చేశాను. నాకు నమ్మకం లేకుండానే చరణ్‌కు చెవిటి మెషీన్ ఇచ్చేశాను. అయితే, చరణ్ నన్ను నమ్మి చెవిటి మెషీన్ పెట్టుకోవడం వల్లే ఆ పాత్రను కొనసాగించగలిగాను. ఈ విజయం చరణ్‌ది. ఈ పాత్రను యాక్సెప్ట్ చేయడమే దారుణమైన విషయం. అత్యంత దారుణం. ఇదో సాహసం. నువ్వు చేయకపోతే నేను ఏమీచేయలేను. కాదు అంటే ఇంకో పాత్ర చెప్పేవాడిని. నువ్వు ఎక్కడ నమ్మావో? ఎలా నమ్మావో? నీ కన్విక్షన్ ఏమిటో నాకు తెలియదు. ఈ క్యారెక్టర్ ఎంత ఓన్ చేసుకున్నావంటే చివరకు సెట్లో ప్యాంట్ వేసుకోమంటే.. ఎందుకు డార్లింగ్ లుంగీ బాగుంది అనే స్థితికి వచ్చేశావు. షర్టు పొరపాటున కొత్తగా ఉంటే ఆయిల్ పూసుకుని, మట్టి రాసుకుని, ఇంత డీ గ్లామరైజ్డ్‌గా, అంత చండాలంగా స్క్రీన్ మీద కనిపించావు. ఫస్ట్ షెడ్యూల్‌లో చరణ్ స్కిన్ ఎంతో అందంగా ఉండేది. ఆ స్కిన్ కూడా పాడు చేసేసుకుని డీ గ్లామరైజ్డ్ గా తయారయ్యారు. నేను ఎలా ఉన్నా ఫర్వాలేదు క్యారెక్టర్ బావుండాలని తపనపడి నువ్వు అలాగే ఉన్నావు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా నీది. ఇది కేవలం నీ వల్లే సాధ్యమైంది అని సుకుమార్ అన్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.