»   » ఇదేం పిచ్చి: ఆపరేషన్ బెడ్ పై నుంచే హీరోగారు...సెల్ఫీ

ఇదేం పిచ్చి: ఆపరేషన్ బెడ్ పై నుంచే హీరోగారు...సెల్ఫీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై :బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ట్విట్టర్‌లో ఎప్పుడూ ఏదో ట్వీట్ చేస్తూ ఉషారుగా ఉంటూంటాడు. ప్రతిక్షణం తనేం చేసేది తన అభిమానులతో పంచుకుంటుంటాడు. భుజానికి గాయంతో బాధపడుతున్న రణ్‌వీర్‌ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సమయంలోనూ తన స్థితిని అభిమానులకు తెలపడానికి ఆస్పత్రి మంచం మీద పడుకున్న ఫొటోను తీసి ట్విట్టర్‌లో పెట్టాడు. వైద్యుడు తన మెడకు సూది మందు ఇచ్చాడంటూ లైవ్‌ కామెంటరీ ఇచ్చాడు రణ్‌వీర్‌.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూర్తి వివరాల్లోకి వెళితే...

Ranveer Singh shares selfie from the operation theatre

ప్రముఖ హిందీ సినీ నటుడు, యువ సంచలనం రణ్‌వీర్ సింగ్ గాయం పాలయ్యారు. ప్రసిద్ధ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న చారిత్రక కథా చిత్రం 'బాజీరావు మస్తానీ' షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. జైపూర్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతుండగా గుర్రం మీద నుంచి రణ్‌వీర్ సింగ్ కిందపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అదృష్టవశాత్తూ, ఆయనకు ఎముకలు విరగడం లాంటివేమీ జరగలేదు. షూటింగ్‌లలో గాయపడడం రణ్‌వీర్‌కు కొత్త ఏమీ కాదు. గతంలో కూడా 'లూటేరా' షూటింగ్ సమయంలో రణ్‌వీర్‌కు వీపు భాగంలో తీవ్రమైన గాయమైంది. అలాగే, 'గుండే' షూటింగ్‌లో ఆయన చేతికీ, చెంపకూ గాయాలయ్యాయి.

తాజా ప్రమాదం గురించి వ్యాఖ్యానిస్తూ, ''బడీ బడీ ఫిల్మోం మే ఐసీ ఛోటీ ఛోటీ బాతేం హోతీ రహతీ హై'' (పెద్ద పెద్ద సినిమాల్లో ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతుంటాయి) అని రణ్‌వీర్ హిందీ హీరోల విలక్షణ శైలిలో వ్యాఖ్యానించారు.

English summary
Ranveer Singh has had bouts of injuries while shooting for his films. The recent one being on the sets of the upcoming period drama Bajirao Mastani. The actor, who was of late spotted at events with an arm bandage due to his shoulder injury, underwent a surgery in Mumbai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu