»   » నెలకొక లిప్ లాక్.... ప్రతీ నెలా తొమ్మిదో తేదీ రచ్చే

నెలకొక లిప్ లాక్.... ప్రతీ నెలా తొమ్మిదో తేదీ రచ్చే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవిడ్ లో రణ్వీర్ సింగ్ వాణీ కపూర్ ఇద్దరూ నటిస్తూ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమా సినిమా పేరు బేఫిక‌ర్ (దోజ్ హు డేర్ టు లవ్)... అందుకేనేమో ఎటువంటి భ‌యం లేకుండా హీరో హీరోయిన్ లు ఒకటీ రెండూ కాదు ఏకంగా 23 సార్లు లిప్ లాకేసుకున్నారు..

ర‌ణ్‌వీర్‌సింగ్‌, వాణిక‌పూర్ జంట‌గా వ‌స్తున్న హిందీ మూవీ బేఫిక‌ర్ లో హీరో, హీరోయిన్ లు క‌లిసే ప్ర‌తి స‌న్నివేశంలోనూ ఒక ముద్దు సీన్ పెట్టేశాడు ద‌ర్శ‌కుడు. ఇక ఫస్ట్ లూక్ దగ్గర్నుంచీ అంటే గత నాలుగు నెలల నుండి ఇదే డేటుకి ఒక పోస్టర్ వచ్చిపడుతోంది. ఆ పోస్టర్ ను చూస్తుంటే బాలీవుడ్ ఉలిక్కిపడుతోంది. బాలివుడ్ ఏమిటీ హిందీ సినిమాలు చూసే ప్రతీ వుడ్డూ ఉలిక్కి పడుతూనే ఉంది... కళ్ళూ నోరూ రెండూ పూర్తిగా తెరుచుకుని అలానే ఉండిపోతున్నాయి.... ఇంతకీ ఈసారేంటంటారా... ఈ సారిదేం ఖర్మా అన్నీ చూసేయండి...

యాజ్ యూజువల్ :

యాజ్ యూజువల్ :

ప్రతీ నెలా రిలీజ్ అయినట్లే ఈ నెల కూడా ''బేఫికర్'' సినిమా కొత్త పోస్టర్ ఒకటి రిలీజైంది. ఇది కూడా యాజూజువల్ ఒక లిప్ కిస్ పోస్టరే.

రకరకాల భంగిమల్లో :

రకరకాల భంగిమల్లో :

మొన్నటివరకు నాలుగు సార్లు రకరకాల బట్టల్లో.. వేర్వేరు ప్రదేశాల్లో.. రకరకాల భంగిమల్లో పెదాల ముద్దును లాగించేసిన హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ వాణి కపూర్ ఇద్దరూ.. ఇప్పుడు హాటు మరోసారి 5వ పోస్టర్ మీద కూడా అలాగే ఓ పెదాల ముద్దు లాగించేశారు.

కాస్త నార్మల్ గానే ఉంది:

కాస్త నార్మల్ గానే ఉంది:

కాకపోతే ఈసారి డోస్ కాస్త నార్మల్ గానే ఉందిలే. డిసెంబర్ 9న విడుదలవుతున్న ఈ సినిమాను కింగ్ ఆఫ్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ గా పేరొందిన అదిత్య చోప్రా తెరకెక్కిస్తున్నాడు.

ఇంకో మూడు ముద్దులు:

ఇంకో మూడు ముద్దులు:

ఈ లెక్కన చూస్తే మనకు ఇంకో మూడు ముద్దు సీన్ల పోస్టర్లు రానున్నాయన్నమాట... ఇక పోస్టర్ల కే జనం కళ్ళప్పగించేస్తుంటే రేపు థియేతర్లకు సినిమా వచ్చేస్తే...!? ఇంకేముందీ అందరూ పరుగులు పెట్టరూ...

కేవలం పోస్టర్లతో:

కేవలం పోస్టర్లతో:

ఏదేమైనా కూడా కూడా కేవలం పోస్టర్లతో ట్రెండింగ్ చేసేసి.. హైప్ సృష్టించి.. మతిపోగొట్టేయడం అనేది మనం బాలీవుడ్డోళ్ళ దగ్గరే నేర్చుకోవాలి.

ఒకే ముద్దుతో ఇన్నేసి పోస్టర్లు:

ఒకే ముద్దుతో ఇన్నేసి పోస్టర్లు:

మన రాజమౌళి కొన్ని క్యారెక్టర్ల కోసం ఓ 10 బాహుబలి పోస్టర్లు రిలీజ్ చేస్తే.. వీళ్లు మాత్రం ఒకే ముద్దుతో ఇన్నేసి పోస్టర్లు వేస్తున్నారు.

రికార్డులన్నీ చెరిగిపోతాయన్న మాట.:

రికార్డులన్నీ చెరిగిపోతాయన్న మాట.:

ఇలా ఒక సినిమాలో 23 లిప్ కిస్సులంటే.. ఇండియన్ ఫిలింస్ లో ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ చెరిగిపోతాయన్న మాట.

ఏ మాత్రం మొహమాటపడ్డంలేదు:

ఏ మాత్రం మొహమాటపడ్డంలేదు:

ఇక రణవీర్ కి ముద్దులిచ్చేందుకు వాణి కపూర్ ఏ మాత్రం మొహమాటపడ్డంలేదని యూనిట్ వర్గాలంటున్నాయి. సీన్ పర్ఫెక్షన్ కోసం ఎన్నిసార్లు అయినా పెదాలను అప్పగించేస్తోందట కూడా.

డిసెంబరు 9న :

డిసెంబరు 9న :

విశాల్-శేఖర్ సంగీతమందిస్తున్న ఈ సినిమా డిసెంబరు 9న తెరమీదికి రానుంది. ‘బాజీరావు మస్తానీ' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన రణ్‌వీర్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకోనున్నాడో మరి..!

ఆదిత్య చోప్రా:

ఆదిత్య చోప్రా:

బాలీవుడ్ రచయిత, దర్శకుడు, నిర్మాత ఆదిత్య చోప్రా తన తండ్రి 83వ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదేళ్ళ తర్వాత ఈ సినిమా కోసమే మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నాడు...

English summary
Ranveer Singh and Vaani Kapoor kiss for the fifth time on the fifth poster of Befikre.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu