»   » అక్కినేని ఇంట విషాదం, అంతలోనే రూమర్స్: నమ్మొద్దు అంటున్న నాగార్జున

అక్కినేని ఇంట విషాదం, అంతలోనే రూమర్స్: నమ్మొద్దు అంటున్న నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అక్కినేని ఇంటి అల్లుడు సత్యభూషణ రావు గురువారం(హీరో సుశాంత్ తండ్రి) మరణంతో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించడంతో అదే రోజు సాయంత్రం జరుగాల్సిన నాగ చైతన్య చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం' ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేసారు.

  'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాను మే 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే అక్కినేని ఇంట విషాదం నెలకొన్న నేపథ్యంలో సినిమాను జూన్ 2కు వాయిదా వేసారనే రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.


  నాగార్జున ఏమన్నారంటే...

  నాగార్జున ఏమన్నారంటే...

  అయితే ‘రారండోయ్ వేడక చూద్దాం' సినిమా వాయిదా వేస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి రావడంతో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు నాగార్జున ఆఫీసును సంప్రదించగా..... అలాంటి దేమీ లేదని, ముందుగా అనుకున్న ప్రకారమే మే 26న సినిమా రిలీజ్ చేస్తామని నాగార్జున చెప్పినట్లు సమాచారం.


  నిన్నే పెళ్లాడుతా రేంజిలో....

  నిన్నే పెళ్లాడుతా రేంజిలో....

  ‘రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘నిన్నే పెళ్లాడుతా' రేంజిలో సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.


  నాగార్జున స్పెషల్ కేర్

  నాగార్జున స్పెషల్ కేర్

  ‘రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నాగార్జున స్వయంగా నిర్మించారు. కొడుకు సినిమా కావడం, తనే నిర్మాత కావడంతో ఈ సినిమాపై నాగార్జున స్పెషల్ కేర్ తీసుకున్నారు.


  రారండయో వేడుక చూద్దాం

  రారండయో వేడుక చూద్దాం

  నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.  English summary
  Akkineni Nagarjuna's brother-in-law passed away recently and entire Akkineni family, Annapurna Studio struck with grief. Meanwhile there were reports in the media that Naga Chaitanya's upcoming film 'Rarandoy Veduka Chuddam' has been postponed. When the same thing was enquired with Nagarjuna office, they have ruled out the news as just rumours. They are saying that Nagarjuna clearly told them that release date is unchanged.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more