For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లివింగ్ లెజెండ్ చిరంజీవి అరుదైన...ఫోటోలు

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : చిరంజీవి, తెలుగు సినిమా పరిశ్రమకు మెగాస్టార్, లివింగ్ లెజెండ్. తన వెండితెర విన్యాసాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవి...80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో తనపేరున ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడని చెప్పడం అతిశయోక్తి కాదేమో...

  ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ఓ సందర్భంలో ఆయన గురించి మాట్లాడుతూ...'కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరి లక్షణాలను చిరంజీవి కలిగి ఉన్నాడు' అని వెల్లడించారు. చిరంజీవి పద్మ భూషణ్ అవార్డు దక్కించుకోవడంతో పాటు, ఆంధ్రాయూనివర్శిటీ నుంచి గౌరవం డాక్టరేట్ అందుకున్నారు. ఉత్తమ నటుడిగా 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులతో పాటు అనేక అవార్డులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రముఖ మేగజైన్ ఫిల్మ్ ఫేర్... చిరంజీవిని "Bigger than Bachchan" ప్రశంసించింది.

  సేవాకార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా చిరంజీవి 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించారు. 2008లో రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అ తర్వాత పరిణామాల నేపథ్యంలో తన పార్టీని జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి.....ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

  చిరంజీవికి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

  భారత దేశం గొప్ప నటుల్లో చిరంజీవి ఒకరు అని చెప్పొచ్చు. ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు.

  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు చిరంజీవి మంచి స్నేహితుడు. ఇద్దరికీ ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

  చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌ను ఆదర్శ సోదరులుగా చెప్పవచ్చు.

  1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో తన కెరీర్ ప్రారంభించారు. ఈచిత్రంలో మోహన్ బాబును కూడా చూడొచ్చు.

  షూటింగులో చిరంజీవి-దాసరి నారాయణరావు

  చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టయ్యాయి. జగదేక వీరుడు అతిలోకి సుందరి ఈ చిత్రం వీరి కాంబినేషన్లో వచ్చిన పెద్ద హిట్

  చిరంజీవి, ఇరత హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీవాతావరణం ఉండేది. అప్పట్లో వీరందరి హాట్ ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి.

  ఒక సందర్భంలో చిరంజీవి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ...ఇటు సినిమా రంగంలో, అటు పర్సనల్ లైఫ్‌లో ఎన్టీఆర్‌ను పవర్ ఫుల్ పర్సన్ గా పేర్కొన్నారు.

  చిరంజీవి, విజయశాంతి అప్పట్లో ఫేవరెట్ జోడీ. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అప్పటి సినిమాల్లో బాగా వర్కౌట్ అయింది. వీరి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే అది హిట్టే. ప్రస్తుతం ఈ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు.

  చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు 50 మంది హీరోయిన్లతో నటించారు. ఆయనతో పని చేసిన ప్రతి హీరోయిన్ ఆయనో స్వీటెస్ట్ పర్సన్ గా పేర్కొనడం గమనార్హం.

  ఓ సినిమా షూటింగులో చిరంజీవికి సంబంధించిన రేర్ ఫోటో

  చిరంజీవితో కలిసి...పవన్ కళ్యాణ్, ఉత్తేజ్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, రవితేజ, జెడి చక్రవర్తి, అలీ తదితరులు

  ఫ్యామిలీతో చిరంజీవి. చిత్రంలో..చిరంజీవి తండ్రి వెంకట్రావ్, తల్లి అంజనిదేవి, సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబులు ఉన్నారు

  క్రికెట్ మెగాస్టార్ తో కలిసి సినీ మెగాస్టార్

  చిరంజీవి బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్. ఆయన సురేఖను పెళ్లాడారు.

  పరిశ్రమలోని అందరితోనూ చిరంజీవి స్నేహ భావంతో మెలుగుతుంటారు.

  బావమరిది అల్లు అరవింద్ భార్య, సంతానంతో... చిరంజీవి

  చిరంజీవి సురేఖను పెళ్లాడారు. వీరికి ముగ్గురు సంతానం. సుస్మిత, శ్రీజ, రామ్ చరణ్

  తల్లిదండ్రులు, భార్య పిల్లలతో చిరంజీవి

  చిరంజీవి, పవన్ కళ్యాణ్...

  English summary
  Chiranjeevi, the megastar of Telugu Cinema is a living legend. He has made millions of people around the world proud to be Telgites. He has put the greatness of Telugu language in the forefront. Veteran director K Balachander had once said, "Chiranjeevi has both Kamal Hassan and Rajnikanth in him". He has received Padmabhushan, an Honorary Doctorate from Andhra University, eight Filmfare Awards for Best Actor, four Nandi Awards and many other numerous awards in his film career. Popular magazine Filmafare had quoted him "Bigger than Bachchan".
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X