»   » నాది 14 ఏళ్ల పోరాటం, చులకనగా చూడొద్దు: యాంకర్ రష్మి

నాది 14 ఏళ్ల పోరాటం, చులకనగా చూడొద్దు: యాంకర్ రష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన రష్మి.... అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ... సినిమాల్లో కూడా నటించడంపై కొందరు తనను రకరకాలుగా ప్రశ్నిస్తున్నారని.... నేనేదో చేయకూడని తప్పు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని, రెండు రంగాలు తనకు ముఖ్యమైనవే అని రష్మి స్పష్టం చేశారు.

14 ఏళ్ల పోరాటం

14 ఏళ్ల పోరాటం

టీవీ రంగంలోకి రాక ముందు తాను సినిమాల్లో ట్రై చేశాను. దాదాపు 14 సంవత్సరాల పాటు నిలదొక్కుకునేందుకు పోరాడాను. కానీ నాకు అంతిమంగా బుల్లితెర రంగమే బాగా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాతే సినిమాల్లో అవకాశాలు పెరిగాయి అని రష్మి తెలిపారు.

తక్కువ చేసి చూడొద్దు

తక్కువ చేసి చూడొద్దు

బుల్లితెర రంగాన్ని ఎవరూ తక్కువ చేసి చూడొద్దని, వెండితెరకు ధీటుగా బుల్లితెరకు ఆదరణ ఉందని... పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇపుడు బుల్లితెర వైపు చూస్తున్నారని యాంకర్ రష్మి స్పష్టం చేశారు.

ఎఫైర్ నిజం కాదు

ఎఫైర్ నిజం కాదు

ఈ మధ్య తన గురించి రకరకాల వార్తలు వింటున్నాను. నేను ఓ బుల్లితెర నటుడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లు రాస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. నేను ఎవరినీ ప్రేమించడం లేదు, నా ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉంది అని రష్మి తెలిపారు.

రష్మి బిజీ బిజీ

రష్మి బిజీ బిజీ

యాంకర్ రష్మి ఇపుడు వరుస అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతోంది. రష్మి సినిమాలు చేస్తూనే జబర్దస్త్ కామెడీషోకు యాంకర్ గా, ఆడియో ఫంక్షన్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

నోరు జారిన యాంకర్ రష్మి, వైజాగ్ యువకుడితో పెళ్లి అంటూ పుకార్లు!

నోరు జారిన యాంకర్ రష్మి, వైజాగ్ యువకుడితో పెళ్లి అంటూ పుకార్లు!

రష్మి త్వరలో వైజాగ్ యువకుడిని పెళ్లాడబోతోంది అంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఆమె ప్రేమిస్తోందని, త్వరలోనే పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయని రూమర్స్ స్పెడ్ అయ్యాయి...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Jabardast fame anchor Rashmi Gautam is busy in small screen as well as silver screen. She acted as heroine in few films like Guntur Talkies which did a good business. Rashmi has condemned rumours of love between her and small screen actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu