»   » ప్రభాస్ జస్ట్ మిస్: పెళ్లి విషయం ఖరారు చేసిన హీరోయిన్!

ప్రభాస్ జస్ట్ మిస్: పెళ్లి విషయం ఖరారు చేసిన హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగులూరు: ప్రభాస్ తాజా మూవీ 'సాహో'లో హీరోయిన్‌గా నటించే అవకాశం మిస్ అయిన కన్నడ హీరోయిన్ ఇపుడు తన పెళ్లికి సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్ అయింది. ఆ అమ్మడి పేరు రష్మిక. కన్నడ హిట్ మూవీ 'కిరిక్ పార్టీ' ద్వారా పాపులర్ అయిన రష్మిక..... ఈ చిత్రంలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టిని వివాహం చేసుకోబోతోంది.

రక్షిత్ శెట్టి, రష్మిక 'కిరిక్ పార్టీ' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఇద్దరి పెళ్లికి అటు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.

రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా...

రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా...

రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ రష్మిక చేసిన ఫేస్ బుక్ పోస్టుతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబుతున్న విషయం అఫీషియల్ అయిపోయింది.

తన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ...

తన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ...

రక్షిత్ శెట్టిని తన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ రష్మిక చేసిన ఫేస్ బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్టు ద్వారా త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు ఈ జంట.

జులై 3న నిశ్చితార్థం

జులై 3న నిశ్చితార్థం

జులై 3న రష్మిక, రక్షిత్ శెట్టి నిశ్చితార్థం జరుగబోతున్నట్లు సమాచారం. నిశ్చితార్థం తర్వాత వివాహ తేదీని ప్రకటించనున్నారు.

ఇన్నాళ్లు రహస్యంగా..

ఇన్నాళ్లు రహస్యంగా..

కిరిక్ పార్టీ సినిమా షూటింగులోనే ప్రేమలో పడ్డ ఈ జంట.... ఇంతకాలం తమ లవ్ రిలేషన్ షిప్‌ను రహస్యంగా మెయింటేన్ చేశారు. ఆ మధ్య తమ ఎఫైర్ గురించి వచ్చిన వార్తలను కూడా ఖండించారు. కట్ చేస్తే... ఇపుడు పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ అయ్యారు.

English summary
Simple Star Rakshit Shetty and the dazzling Rashmika Mandanna are on news for some time, following the release of their movie, Kirik Party. The rumours that there is something between them have been making rounds all around the S-town. A couple of days ago, there were gossips that said that these two would get engaged on July 3 this year, and Filmibeat was first to report you that. Rashmika Mandanna had previously squashed all the rumours by insisting that all rumours were false.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X