»   » బోర్ కొట్టి ... : రాశీ ఖన్నా సరదా సెల్పీ (ఫొటో)

బోర్ కొట్టి ... : రాశీ ఖన్నా సరదా సెల్పీ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా షూటింగ్ లకు తండ్రితో కలసి హాజరవుతుంటుంది హీరోయిన్ రాశీ ఖన్నా. ''నేను షూటింగ్‌ కోసం సిద్ధమవుతుంటే మా నాన్న ఇలా సేదతీరుతున్నారు చూడండి. ఏం చేస్తాం బోరు కొడుతోందేమో'' అంటూ ఈ సరదా సెల్ఫీని ఫేస్‌ బుక్‌లో పెట్టింది రాశీ ఖన్నా. బాలీవుడ్ మూవీ మద్రాస్ కేఫ్ తో మురిపించి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు జనాలను మైమరపించిన క్యూట్ బ్యూటీ రాశి ఖన్నా.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

హాట్ బ్యూటీ రాశి ఖన్నా.... ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు.. అంత ఈజీగా ఆఫర్లు రాలేదనే చెప్పాలి....
సందీప్ కిషన్ వంటి అప్ కమింగ్ హీరోతో కలిసి నటించిన జోరు సినిమా రాశి ఖన్నాకు నిరాశనే మిగిల్చింది. దీంతో రవితేజ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ తో తెరకెక్కుతున్న బెంగాల్ టైగర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు కమిటైంది ఈ అందాల రాశి....అయితే గోపిచంద్ సరసన నటించిన జిల్ మూవీపై రాశి ఖన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుంది. వాటిని చాలా వవరూ ఈ చిత్రం తీర్చిందనే చెప్పాలి.

Rasi Khanna with her father selfie

జిల్ సినిమా రిలీజ్ కాకముందే రాశి ఖన్నాకు కొన్ని ఆఫర్లు వచ్చినా.. వాటిని అస్సలు ఒప్పుకోలేదట ఈ ముద్దుగుమ్మ... జిల్ సినిమాతో తనకు హిట్ రావడం ఖాయమనే ఫీలింగ్ లో ఉన్న ఈ అప్ కమింగ్ బ్యూటీ.. సినిమా రిలీజైన తరువాతే కొత్త సినిమాకు కమిటవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యి...ఇప్పుడు వరస సినిమాలు పట్టుకుంటోంది. జిల్ సక్సెస్ సాధిస్తే.. తనకు క్రేజీ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తాయని.. రెమ్యూనరేషన్ కూడా పెంచేయొచ్చని ప్లాన్ చేసిందట రాశి ఖన్నాకు అంతలా ఆశలు నెరవేరలేదనే చెప్పాలి.

జిల్ ఆడియో ఫంక్షన్ లోనే జిగేల్ మనిపించే డ్రస్సులో కేక పుట్టించిన రాశీ.. సినిమాలోనూ తన సెక్సీ ఫిగర్ తో స్ర్కీన్ ను షేక్ చేసింది. సాంగ్స్ లోనూ సూపర్బ్ స్కిన్ షోతో ఏసీ సినిమా హాళ్లలోనూ ఉక్కపోత పెంచిన ఈ బ్యూటీ అంతలోనే ఇంత గ్లామర్ క్వీన్ లా మేకోవర్ కావడానికి కారణం తెలిసింది. రాశి ఖన్నా పర్ ఫెక్ట్ ఫిగర్ కు ఆమె తీసుకుంటున్న డైటే కారణమట.

Rasi Khanna with her father selfie

డార్క్ చాక్లెట్స్ అంటే ప్రాణం తీసుకునే ఈ ఢిల్లీ పాప.. స్లిమ్ బాడీ, కర్వ్ లుక్స్ కోసం వాటిని కూడా పక్కన పెట్టేసిందట. నోటికి తాళం వేయడం వల్లే.. జిల్ సినిమాలో అమ్మడి లుక్ అంతలా మ్యాజిక్ చేసిందట. మరి జిల్ మూవీలో టోటల్ ఛేంజ్ చూపించిన ఈ బ్యూటీఫుల్ గాళ్.. ప్రస్తుతం రవితేజ బెంగాల్ టైగర్ మూవీలో నటిస్తోంది.

English summary
Raashi Khanna tweeted:" My cuteheart father getting bored while I get ready for my shot "
Please Wait while comments are loading...