»   » బై చెప్తూ ...మహేష్ తో రత్నవేలు (ఫొటో)

బై చెప్తూ ...మహేష్ తో రత్నవేలు (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం ‘శ్రీమంతుడు'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సాంగుతో పాటు కొన్ని సీన్లు చిత్రీకరించారు. ప్రస్తుతం ఊటీలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగివస్తోంది. ఈ సందర్బంగా కెమెరామెన్ రత్నవేలు...హీరో మహేష్ బాబుతో ఫొటో దిగి ట్విట్టర్ లో ఉంచారు. మీరు ఆ ఫొటోని చూడండి.


మరో ప్రక్క చిత్రం హీరోయిన్ కాజల్ నిన్నటితో బ్రహ్మోత్సవం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఊటి నుండి రిటర్న్ అయింది. ఈ సందర్బంగా ట్విట్టర్ సాక్షిగా... తాను ఊటి షూటింగ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసానని తెలిపిన కాజల్ బ్రహ్మోత్సవం టీంకు బైబై చెప్పింది.మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత, రేవతి, తులసి, సత్యరాజ్, నరేష్, జయసుధ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. బ్రహ్మోత్సవం సినిమా ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెకెక్కుతోంది. గతంలో మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావడంతో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.


అందుతున్న సమచారం ప్రకారం న్యూ ఇయిర్ కానుకగా జనవరి 1న బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే అఫీషియల్ గా ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ ''ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్‌ జరిగాయి. ఊటీలో చిత్రంలోని నటీనటులందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తాం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్‌ తర్వాత మహేష్‌తో మళ్ళీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు. పి.వి.పి. సినిమా అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు.


Ratnavelu tweeted a photo with Mahesh Babu

మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం : మిక్కీ జె. మేయర్, డాన్స్ : రాజు సుందరం, ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ గుణ్ణం, నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ,స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.


English summary
RathnaveluDop tweeted: Just wrapped up a hectic shooting schedule in Ooty for Brahmotsavam urstrulyMahesh PVPCinema
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu