»   » ప్రభాస్, రానాతో రవీనా టాండన్ హల్‌చల్.. సెల్ఫీ వైరల్..

ప్రభాస్, రానాతో రవీనా టాండన్ హల్‌చల్.. సెల్ఫీ వైరల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ చిత్రం మొహ్రాలో తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ అంటూ కుర్రకారు హృదయాల్లో గిలిగింతలు పెట్టిన అలనాటి అందాలతార రవీనా టాండన్. ఈ మధ్య పాండవులు పాండవులు తుమ్మెద అనే చిత్రంలో మోహన్‌బాబు సరసన నటించింది. గతంలో నాగార్జునతో ఆకాశ వీధిలో అనే చిత్రంలో నటించింది. అయితే రవీనా టాండన్ గురించి ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే.. బాహుబలి హీరోలు ప్రభాస్, రానా దగ్గుబాటితో ఆమె దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ కావడమే.

 డిన్నర్‌లో బాహుబలితో రవీనా సెల్పీ

డిన్నర్‌లో బాహుబలితో రవీనా సెల్పీ

శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ పార్టీలో ప్రభాస్, రానా, అనుష్క, రవీనా టాండన్ కలుసుకున్నారు. దాంతో రవీనాతో బాహుబలి నటీనటులు సెల్ఫీ దిగారు. ఇక.. ఆ ఫోటోను రవీనా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఆఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోపై నెటిజన్లు భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు.

 ప్రభాస్‌, అనుష్క కత్తి బహుమతి

ప్రభాస్‌, అనుష్క కత్తి బహుమతి

బాహుబలితో జాతీయ స్థాయి ప్రజాదరణను పొందిన ప్రభాస్, అనుష్కకు రవీనా టాండన్ కత్తిని బహుకరించింది. ఈ పార్టీలో బాహుబలి నటీనటులతో చాలా సమయాన్ని గడిపినట్టు తెలుస్తున్నది. అయితే ఈ పార్టీ ఎక్కడ, ఎందుకు జరిగిందనే విషయంపై వివరాలు అందుబాటులోకి రాలేదు.

 జాతీయ స్థాయి గుర్తింపు

జాతీయ స్థాయి గుర్తింపు

బాహుబలి సృష్టించిన ప్రభంజనం కారణంగా నేషనల్ లెవెల్లో ప్రభాస్, రానా, అనుష్కకు మంచి పేరు వచ్చింది. వీరి నటనకు బాలీవుడ్ హీరోలు కూడా ఫిదా కావడం విశేషం. బాలీవుడ్‌లో నటించాలని వీరికి ఆఫర్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

 సాహో చిత్రంలో ప్రభాస్

సాహో చిత్రంలో ప్రభాస్

బాహుబలి తర్వాత ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ తార శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నది. బాహుబలి చిత్రాల తర్వాత రానా ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలలో నటించారు. అనుష్క ప్రస్తుతం భాగమతి చిత్రంలో నటిస్తున్నది.

English summary
Yester years Bollywood actor Raveena Tandon visited Hyderabad and joined in a party with Baahubali stars Prabhas, Rana, Anushka. In this occasion, they posed for a selfie. That selfie photo goes viral after Raveena posted her social media account.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu