»   » సల్మాన్‌తో నటించొద్దని అమీర్.. తగాదా పడ్డారు. 21 ఏళ్ల హీరోయిన్లు కావాలా.. రవీనా

సల్మాన్‌తో నటించొద్దని అమీర్.. తగాదా పడ్డారు. 21 ఏళ్ల హీరోయిన్లు కావాలా.. రవీనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రస్తుతం మాతృ అనే చిత్రంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకొనే పనిలో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో గతంలో వచ్చిన అందాజ్ అప్నా అప్నా చిత్రానికి సీక్వెల్ గురించి స్పందించాలని మీడియా రవీనాను కోరగా ఆశ్చర్యకరమైన సమాధానమివ్వడం పలువురిని షాక్ గురిచేసింది. బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే హీరోయిన్లను అంతగా పట్టించుకోరు కానీ హీరోలు మాత్రం తమ వయసులో సగం వయసు ఉన్న కుర్ర హీరోయిన్ల వెనుక పడుతారని చురక అంటించింది.

అందాజ్ అప్నా అప్నాలో..

అందాజ్ అప్నా అప్నాలో..

అందాజ్ అప్నా అప్నా చిత్రంలో అమీర్, సల్మాన్ ఖాన్‌, కరీనా కపూర్‌తో కలిసి రవీనా టాండన్ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అందాజ్ అప్నాఅప్నా సీక్వెల్‌పై స్పందించారు. ఆ సినిమా సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు ఆమె గుర్తు చేసుకొన్నారు.

వారికి 21 ఏళ్ల హీరోయిన్లు కావాలా

వారికి 21 ఏళ్ల హీరోయిన్లు కావాలా

ఇటీవల కరీనా, తాను ఉన్న ఫొటోలకు అమీర్, సల్మాన్ దండలు వేస్తున్న అంశంపై తీవ్రంగా స్పందించారు. మా భార్యలు చనిపోయారు. ఇప్పుడేం చేయాలి అనే వ్యాఖ్యలతో ఓ ఫోటో పెట్టడంపై మండిపడ్డారు. వారు మమ్మల్ని వదిలేసి 21 ఏళ్ల కుర్ర హీరోయిన్ల వెనుక పడుతున్నారు అని అన్నారు.

అమీర్, సల్మాన్ మధ్య విబేధాలు

అమీర్, సల్మాన్ మధ్య విబేధాలు

ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ విభేదాలు తలెత్తాయి. ఈ చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపై నిర్మాత, దర్శకుల వద్ద తంటాలు పడ్డారు. దాంతో తలలు పట్టుకొన్న చిత్ర నిర్మాతలు ఎవరికీ తక్కువ కాకుండా సమాన ప్రాధాన్యం ఇవ్వడంతో గొడవ సమసిపోయింది. తొలుత ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ తర్వాత రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.

సల్మాన్ తీరుపై అమీర్ ఆగ్రహం

సల్మాన్ తీరుపై అమీర్ ఆగ్రహం

అందాజ్ అప్నా అప్నా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ ఆలస్యంగా వచ్చేవాడు. ఆ విషయంపై అమీర్ ఖాన్ మండిపడేవాడు. అప్పుడే సల్మాన్‌తో కలిసి నటించకూడదు అని నిర్ణయం తీసుకొన్నాడు, వారిద్దరి మధ్య అప్పట్లో కోల్డ్‌వార్ నడిచేది అని రవీనా వెల్లడించింది.

వారు మాట్లాడుకొనే వారు కాదు..

వారు మాట్లాడుకొనే వారు కాదు..

ఆ చిత్ర షూటింగ్‌లో కరిష్మా కపూర్‌, నాతో కూడా సరిగా మాట్లాడేవారు కాదు. వారిద్దరికి ఇగో ప్రాబ్లం ఉండేది. వాస్తవ జీవితంలో కూడా వారిద్దరితో చాలా తక్కువగా మాట్లాడే వారం. కనీసం కళ్లలో కళ్లు పెట్టుకొని మాట్లాడుకొనే వాళ్లం కాదు.

షూటింగ్‌కు సచిన్

షూటింగ్‌కు సచిన్

అందాజ్ అప్నా అప్నా షూటింగ్ ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్, అమీర్, కరిష్మా, రవీనా టాండన్ నటించారు.

సీక్వెల్‌పై చర్చ

సీక్వెల్‌పై చర్చ

బాలీవుడ్ చరిత్రలోనే అద్భుతమైన హాస్య చిత్రంగా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. అయితే సీక్వెల్ చిత్రంలో తమకు కూడా నటించే అవకాశం ఉండాలనే అభిప్రాయాన్ని రవీనా టాండన్ వ్యక్తం చేసింది.

English summary
Raveena Tandon in a recent interview was asked about a sequel to Andaz Apna Apna, the actress gave a tongue-in-cheek response saying. Aamir Khan and Salman Khan were approached to sign the contract for the movie, each of them wanted more screen time than the other, but finally settled for the same amount of screen time. Aamir was so upset with Salman for arriving too late on the sets that he decided not to ever work with him again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu