Just In
- 19 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దెయ్యం ఎక్కడ ఉందో చెప్పగలరా? మళ్లీ భయపెట్టనున్న రవిబాబు
ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదగడం కష్టేమ అయినా.. పట్టుదలతో ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. చలపతిరావు లాంటి ఫాదర్ ఉన్నా.. తన సొంతకాళ్లపై నిలబడుతూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు రవిబాబు. దర్శకుడిగా తాను తెరకెక్కించే సినిమాల్లో ఉండే వైవిధ్యమే దానికి కారణం.

నటుడి నుంచి దర్శకుడిగా..
విలన్ రోల్స్ నుంచి కామెడీ పాత్రల వరకు తన నటనతో మెప్పించ్చాడు రవిబాబు. అల్లరి చిత్రంతో దర్శకుడిగా మారి ఎన్నో విభిన్న చిత్రాలను తెరకెక్కించాడు. ప్రేమ, హాస్యం, హారర్, థ్రిల్లర్, సైకో థ్రిల్లర్ మూవీలను తీసి అందర్నీ మెప్పించాడు. అమ్మాయిలు.. అబ్బాయిలు, సోగ్గాడు, నచ్చావులే, మనసారా, అనసూయ, అమరావతి, నువ్విలా, అవును, అవును2 ఇలా ఎన్నో హిట్ చిత్రాలను తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు.

రీసెంట్‌గా పందితో సినిమా..
తాను ఏది చేసినా ప్రత్యేకంగా ఉండేలా చూసుకునే రవి బాబు.. పందితో సినిమా తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే పందితో సినిమా తీసేందుకు చాలా కష్టపడ్డట్టు తెలిపాడు. అదుగో అంటూ చిత్రీకరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయింది. దీంతో మళ్లీ తనకు కలిసొచ్చిన హారర్ జానర్ ను ఎంచుకున్నాడు.

టైటిల్ తోనే ఆసక్తి రేపి..
రవి బాబు పెట్టే టైటిల్స్ అన్నీ షార్ట్ అండ్ స్వీట్ గానే ఉంటాయి. అంతేకాకుండా ఆసక్తి రేపే విదంగానూ ఉంటాయి. తాజాగా ఆవిరి అంటూ ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్నాుడ. కాసేపటి క్రితమే టీజర్ ను విడుదల చేశారు. ఓ ఇంట్లో.. రాజ్ కుమార్ రావు అతని కుటుంబం.. వారితో పాటు ఓ ఆత్మ కూడా నివసిస్తుందంటా.. అయితే మీరు ఆ ఆత్మకు కనుక్కోగలరా? అంటూ చాలెంజ్ విసిరాడు..

దిల్ రాజు నిర్మాతగా
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఆవిరి మూవీని త్వరలోనే విడుదల చేయనున్నారు. అయితే గత కొద్దికాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవిబాబు ఈ సినిమాతో సక్సెస్ సాధించే పనిలో పడ్డారు. ఈ సినిమాతోనైనా మళ్లీ పునర్ వైభవాన్ని అందుకొంటాడా లేదా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.