Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఓవర్ యాక్షన్ చేయకు!.. శివజ్యోతిపై రవికృష్ణ సెన్సేషనల్ కామెంట్స్
బిగ్ బాస్ షోలో కొన్ని బంధాలు ఏర్పడుతుంటాయి. అందులోఉండేవారికి అదే ప్రపంచం.తిట్టుకున్నా కొట్టుకున్నా కూడా మళ్లీ కలిసిపోవాల్సి వస్తుంది. 24 గంటలు ఒకరి మొహాలను ఇంకొకరు చూసుకుంటూ ఉంటారు. అలా కొంత మంది దగ్గరవుతుంటారు. అందులోనూ గేమ్ కోసం కొందరు దగ్గరవుతుంటారు. అయితే అక్కడ ఏర్పడిన బంధాలు షో తరువాత కూడా కొనసాగుతూ ఉంటాయి. అలా మూడో సీజన్‌లో శివజ్యోతి, రవికృష్ణలు కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు.

బిగ్ బాస్ షోలో అలా..
బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం రవికృష్ణ శివజ్యోతి అక్కాతమ్ముళ్లలా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకున్నారు. అవసరైమన సమయంలో ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. అలా షోలో హిమజ, రోహిణి, అషూ, శివజ్యోతి, రవికృష్ణ అందరూ కూడా ఎంతో కలిసి మెలిసిఉన్నారు. ఇక రవికృష్ణ వెళ్లే సమయంలో అయితే శివజ్యోతి దారుణంగా ఏడ్చేసింది.

బయట కూడా అలానే..
బయటకు వచ్చాక శివజ్యోతి, రవికృష్ణ కుటుంబ సభ్యుల్లానే కలిసి ఉంటున్నారు. రవికృష్ణ ఎక్కువగా శివజ్యోతి ఇంట్లోనే ఉంటాడు. ఆ మధ్య బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ కలిసి శివజ్యోతి నూతన గృహ ప్రవేశం నాడు రచ్చ రచ్చ చేశారు. అందులో అందరికీ రవికృష్ణ అల్లరి వైరల్ అయింది.

కరోనా సోకినా కూడా..
కరోనా వైరస్ అంటూ జనాలు భయపడిపోతోన్న తరుణంలో రవికృష్ణకు పాజిటివ్ వచ్చింది. అలాంటి సమయంలోనూ శివజ్యోతి అతడిని ఇంట్లోనే పెట్టుకుందట. ఎంతో బాగా చూసుకుందంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు. అక్క కాదు అమ్మలాంటిదంటూ ఎమోషనల్ అయ్యాడు.
Recommended Video

తాజాగా ఇలా..
అయితే తాజాగా శివజ్యోతి ఓ పోస్ట్ చేసింది. అందులో ఓ వీడియోను షేర్ చేసింది. ఇంట్లో వంట రూంలో కొత్త గ్యాస్‌ను కొనుక్కున్నట్టుంది. నాలుగు బర్నర్‌లున్న అల్ట్రా మోడ్రన్ స్టవ్‌ను కొనుక్కుంది. దాని గురించి వివరంగా చెప్పుకొచ్చింది. ఎప్పుడో డబ్బులు ఇచ్చాడు కానీ ఇప్పుడు కొనుక్కున్నాను.. అంటూ రవికృష్ణకు సారీ చెప్పుకొచ్చింది. ఇక ఆ పోస్ట్‌పై రవికృష్ణ సీరియల్ అవుతూ.. ఓవర్ చేయకు మా అంటూ రిప్లై ఇచ్చాడు.