»   » 'రవితేజ నిన్నొదలా!' అంటున్న అనుష్క

'రవితేజ నిన్నొదలా!' అంటున్న అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

'విక్రమార్కుడు', 'బలాదూర్‌'ల్లో రవితేజ సరసన నటించిన అనుష్క తాజాగా రవితేజ నూతన చిత్రం 'వీర'లోనూ హీరోయిన్ గా ఎంపకైంది. ఈ కాంబినేషన్ అయితే క్రేజీగా ఉంటుందని దర్శకుడు రమేష్ వర్మ పట్టుబట్టి ఒప్పించాడని తెలుస్తోంది. అయితే రవితేజ ప్రక్కన చేయటం అనుష్కకు సైతం ఆనందాన్నిస్తోంది. ఆమే స్వయంగా..."టాలీ టూ హాలీ ఫిలిమ్స్‌ రవితేజతో నిర్మించే సినిమాలో నటించబోతున్నాను అని మీడియాకు తెలియచేసింది. గతంలో రైడ్ తో హిట్ కొట్టిన రమేష్ వర్మ ఈ తాజా చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. గణేష్‌ ఇందుకూరి నిర్మించే ఈ చిత్రం మాస్‌, యాక్షన్‌ అంశాలతో అల్లుకొన్న వినోదాత్మకమైన కథ అని తెలిస్తోంది. అలాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్ కీ స్థానం ఉంది. ఆమె ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఇక ప్రస్తుతం అనుష్క...మహేష్ ‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రంలో చేస్తోంది. అలాగే బిందాస్ దర్శకుడు వీరు పోట్ల డైరక్షన్ లో నాగార్జున నటించే సినిమాకు గతంలోనే అంగీకారం తెలిపింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu